CM Revanth Reddy | ఆ వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్
CM Revanth Reddy | హైడ్రా (HYDRAA) ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) అన్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా (HYDRAA) ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) అధిష్టానంకూడా తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) అన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇంటర్వ్యూలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. హైడ్రాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మందలించినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ నైతికత, సిద్ధాంతాలకు వ్యతిరేకమని సీనియర్ నేతలు అభివర్ణించినట్లు కేసీ పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం తన అసంతృప్తిని రేవంత్ రెడ్డికి తెలియజేసినట్లు చెప్పారు. బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు క్రమశిక్షణతో వ్యవహరించాలని సీఎంకు హైకమాండ్ సూచించినట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
కాగా, ఇటీవలే బెంగుళూరలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరంతో పాటు శివారు పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటైన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హైడ్రా' వర్డ్ అనేది హిట్లర్ ఫేవరేట్ వర్డ్. 'హైడ్రా' అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం. అతని వద్ద ఉన్న కోర్ బృందాన్ని హైడ్రా అని పిలిచేవారు. ఆ బృందం మరణమృదంగం సృష్టించేది. కాబట్టి నేను హిట్లర్ నుండి స్ఫూర్తి పొంది, ఆ ప్రాజెక్టుకు 'హైడ్రా' అని పేరు పెట్టాను. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తూ హైడ్రా కబ్జాదారుల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ విషయాన్ని ఎవర్నీ అడిగినా చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read..
టీఎంసీకి మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. నెహ్రూ రికార్డు బద్దలు.. ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటు: టీపీసీసీ నేత చనగాని దయాకర్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!




