త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ్ : పుతిన్

Vladimir Putin | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే అంశంపై మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని చెప్పారు.

D

International | Published On Oct 2, 2026, 11.48 am IST

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ్ : పుతిన్
Advertisement

Vladimir Putin | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఉక్రెయిన్‌తో సుద‌ర్ఘీకాలంగా సాగుతున్న యుద్ధాన్ని (Ukraine conflict) ముగించే అంశంపై మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఉక్రెయిన్​తో యుద్ధం ముగించాలని ప్రయత్నించే నాయకుల్లో మోదీ ఒకరని చెప్పారు. తాము ఎక్క‌డ క‌లుసుకున్నా ప్ర‌ధాని మోదీ ఈ అంశాన్ని ప్ర‌త్యేకంగా లేవ‌నెత్తేవార‌ని తెలిపారు.

ఓ స‌మావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. "మోదీతో నాకు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ప్ర‌పంచ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించే అంశంపై ఆయ‌న నిరంత‌రం నాతో చ‌ర్చిస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడు భేటీ అయినా యుద్ధం ముగింపు గురించే ప్ర‌త్య‌కంగా ప్ర‌స్తావించేవారు. ఢిల్లీలో జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశాల స‌మ‌యంలోనూ ఉక్రెయిన్ వార్ గురించి మోదీ అడిగారు. ప‌ర‌స్ప‌ర ఆమోద‌యోగ్య‌మైన ప‌రిష్కారాల‌ను క‌నుగొనే దిశ‌గా ఆయ‌న వ‌ద్ద చాలా మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయి" అని పుతిన్ కొనియాడారు. శాంతియుత మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనే మోదీ ఆకాంక్షను రష్యా అభినందిస్తోందని పుతిన్ అన్నారు.

Also Read..

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

ప‌సిడికి మ‌ళ్లీ పెరుగుతున్న డిమాండ్‌.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్‌..

Advertisement
Advertisement