Lenin OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి అఖిల్ అక్కినేని వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ
అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌గా లెనిన్ నిలిచింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే లెనిన్ ఓటీటీలోకి వస్తోంది. ఏ ఓటీటీలో...ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On Aug 1, 2026, 12.49 pm IST
Lenin OTT | లెనిన్ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ హిట్టును అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన లెనిన్ సినిమాకు మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగవంశీతో కలిసి హీరో నాగార్జున నిర్మించాడు.zz
19 కోట్లు...
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఆగస్ట్ 7 నుంచి జీ5 ఓటీటీలో లెనిన్ స్ట్రీమింగ్ కాబోతుంది. హిట్టు టాక్ తెచ్చుకున్న లెనిన్ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో లెనిన్ ఆడుతోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను 19 కోట్లకు జీ5 ఓటీటీ కొనుగోలు చేసింది
కెమిస్ట్రీ హైలైట్
లెనిన్ మూవీకి మాస్ రోల్‌లో అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సేతో అతడి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. ప్రమోద్ పంజు విలన్‌గా నటించిన ఈ సినిమాలో శివాజీ, ఈశ్వరీరావు, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో తొలి హిట్టు మూవీగా లెనిన్ నిలిచింది.
లెనిన్ పోరాటం...
శ్రీ రామాపురానికి చెందిన లెనిన్ (అఖిల్) హత్య కేసులో జైలు నుంచి విడుదలవుతాడు. అతడి కారణంగానే ఊళ్లో జరిగే భారతం మిట్ట జాతర ఆగిపోతుంది. పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఆ జాతరలో రక్తం నేల చిందకూడదని ఆచారం ఉంటుంది. ఆ జాతరలోనే తను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతిని లెనిన్ చంపుతాడు? అతడు ఎందుకులా చేశాడు? జైలు నుంచి రిలీజైన లెనిన్ తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో (ప్రమోద్ పంజు) పాటు అతడి చిన్నాన్న యతిరాజు (శివాజీ) వెతుక్కుంటూ శ్రీ రామాపురానికి ఎందుకొచ్చాడు? భారతికి జరిగిన అన్యాయంపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ – లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
అక్టోబర్ 3, 2026

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ – హాట్ ఫొటోలతో షేక్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?



