Abhijeet Dipke | రీల్‌లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు
Abhijeet Dipke | ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా తనను దుర్భాసలాడిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విడుదల చేసిన సెల్ఫీ వీడియోపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు.
Abhijeet Dipke | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా తనను దుర్భాసలాడిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విడుదల చేసిన సెల్ఫీ వీడియోపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు. నిరసనకారులపై పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందా..? అంటూ ప్రశ్నించారు.
'రీల్‌లో మాత్రమే క్షమిస్తారా..? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటారా..?' అంటూ ఎద్దేవా చేశారు. అంతకు ముందు పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధక చట్ట సవరణపై ప్రధాని చేసిన వీడియోపై కూడా దిప్కే వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. దేశ భవిష్యత్తు కంటే మీ చర్మమే ప్రకాశవంతంగా మెరుస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.
వాళ్లు మన పిల్లలు.. వారిని క్షమిస్తున్నా : ప్రధాని మోదీ
అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు చెప్పారు. వారు మన పిల్లలని.. తప్పులు చేయడం సహజమేనని పేర్కొన్నారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందన్నారు. కొంతమంది ఆకతాయిలు అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రధాని వాపోయారు. వారి మాటలు తగవని పేర్కొన్నారు. తనని, తన దివంగత తల్లిని కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లంతా దారి తప్పారని.. సరైన మార్గంలో పెట్టాలన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని ప్రధాని చెప్పుకొచ్చారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వీడియో సందేశం తర్వాత కొన్ని గంటలకే 15 ఏళ్ల బాలిక క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం.
Also Read..
జమ్ము కశ్మీర్‌లో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ.. ఊపిరాడక తండ్రి ఒడిలోనే రోగి మృతి
సంబంధిత వార్తలు

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
అక్టోబర్ 3, 2026

MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
అక్టోబర్ 2, 2026

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
- ●Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
- ●Primebook 3 Max | రూ.35,990కే ప్రైమ్బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్

Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి



