త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైల‌ట్ స్మిత్‌తో ప్రధాని మోదీ

Captain Smit Machchhar | దుబాయ్‌లో చికిత్స పొందుతున్న‌ భార‌తీయ పైల‌ట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాన్ని ప్ర‌శంసించారు.

D

National | Published On Oct 2, 2026, 12.50 pm IST

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైల‌ట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
Advertisement

Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్ : ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఫ్లైదుబాయ్ విమానంలో 180 మంది ప్ర‌యాణికులను కాపాడిన భార‌తీయ పైల‌ట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం దుబాయ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్‌తో ప్ర‌ధాని వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాన్ని ప్ర‌శంసించారు.

140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారంటూ కొనియాడారు. ఆయ‌న‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా స్మిత్ విమానంలో జరిగిన భయానక ఘటన గురించి ప్ర‌ధానికి వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ శ‌రీరంపై ఎన్నో గాయాలున్న‌ప్ప‌టికీ.. ప్ర‌యాణికులను ర‌క్షించేందుకు తీవ్రంగా శ్ర‌మించిన‌ట్లు వివ‌రించారు. క‌ఠిన ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తాన‌ని.. ఈ క్లిష్ట స‌మ‌యంలో కూడా అదే చేశాన‌ని స్మిత్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని నుంచి కాల్ రావ‌డం ప‌ట్ల పైల‌ట్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌, గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

కాగా, ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చివేసేందుకు తన సహ-పైలట్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే క్ర‌మంలో స్మిత్ క‌త్తిపోట్లకు గురైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తీవ్ర గాయాల‌తో ఆయ‌న ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్మిత్‌ను మెరుగైన చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌కి విమానంలో త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం స్థిరంగా ఉన్న‌ట్లు సౌదీలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు స్మిత్ మ‌చ్చ‌ర్ తెగువ‌కు గుర్తింపుగా గుజ‌రాత్ ప్ర‌భుత్వం విశిష్ట పుర‌స్కారం ప్ర‌క‌టించింది. గుజ‌రాత్ రాష్ట్ర విశిష్ట పుర‌స్కార‌మైన 'గుజరాత్ గరిమా అవార్డు' (Gujarat Garima Award)ను కెప్టెన్ స్మిత్‌కు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేంద్ర పటేల్ ప్ర‌క‌టించారు.

Also Read..

స‌ర్ తర్వాత‌ ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్ర‌త్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వ‌ద్ద మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయ్ : పుతిన్

రేవంత్, కేటీఆర్ ఆస్తుల‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి: ర‌ఘునంద‌న్ రావు

Advertisement
Advertisement