MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
MLA Naveen Yadav | దేశంలో బీసీల లెక్కలు తేలాల్సిందే అని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బీసీల లెక్కలు తేలకుంటే.. బీసీల పిల్లల భవిష్యత్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Naveen Yadav | త్రినేత్ర న్యూస్ : దేశంలో బీసీల లెక్కలు తేలాల్సిందే అని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బీసీల లెక్కలు తేలకుంటే.. బీసీల పిల్లల భవిష్యత్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం కులగణనలో బీసీల కాలం చేర్చలేదు.. దీంతో ఓబీసీలు ధైర్యాన్ని కోల్పోతున్నారు. జరగబోయే జనాభా గణనలో ఓబీసీల కాలం చేర్చాలని నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.
అనంతరం టీ పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ వీర్లపల్లి శంకరయ్య మాట్లాడుతూ.. దేశంలో ఓబీసీలను కులగణనలో చేర్చకపోవడంతో అగమ్యగోచరంగా మారింది. బీసీలు దేశ వ్యాప్తంగా తమ హక్కులు కోల్పోతున్నారు. మోదీ వెనుకబడిన కులాల జీవితాలతో చెలగాటమాడుతుంది. బీసీ అని చెప్పుకునే మోదీ బీసీలను అణగదొక్కుతున్నారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలి. బీజేపీ మొండి వైఖరికి నిరసనగా 4న శంషాబాద్ దగ్గర కొల్లూరులో 25 వేల మందితో ఓబీసీ సభ ఏర్పాటు చేస్తున్నాం. మోదీ మెడలు వంచే విధంగా బీసీ గర్జన ఉంటుంది. మా పిల్లల భవిష్యత్ కోసం కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందిస్తాం. ఓబీసీ సభను అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి వీర్లపల్లి శంకరయ్య విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కేంద్రం చేపడుతున్న కులగణనలో ఓబీసీలను చేర్చాలి. మోదీకి వణుకు పుట్టే విధంగా ఓబీసీ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఉద్యోగ, ఉపాధిలో ఓబీసీలకు వాటా దక్కాలంటే కేంద్రం కులగణనలో ఓబీసీలను చేర్చాలి. దేశంలో కులగణన చేసిన ఏకైక నేత రేవంత్ రెడ్డి. చట్టాన్ని చేసి కేంద్రం ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి అని ఐలయ్య డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్
- ●Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ




