IRCTC | ఐఆర్‌సీటీసీ గంగా గయా సంగం యాత్ర.. ఒకే టూర్‌లో గయ, అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల సందర్శన.. హైదరాబాద్ నుంచే స్టార్ట్
IRCTC | ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. "గంగా గయా సంగం యాత్ర" (Package Code: SHA57) పేరుతో ఒక ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
Devotional | Published On Aug 1, 2026, 1.19 pm IST
IRCTC | త్రినేత్ర.న్యూస్ : ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. "గంగా గయా సంగం యాత్ర" (Package Code: SHA57) పేరుతో ఒక ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాత్రను రూపొందించారు. గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల పాటూ ఈ యాత్ర సాగనుంది.
ప్రయాణం సాగుతుందిలా..
- ఈ యాత్ర సెప్టెంబర్ 2న హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రారంభం కానుంది. విమానం హైదరాబాద్ నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరుతుంది. కోల్‌కతా మీదుగా సాయంత్రం 4:30కు గయకు చేరుకుంటుంది.
- హోటల్‌లో చెక్ఇన్ చేసిన తర్వాత ప్రముఖ మహా బోధి ఆలయం, సమీపంలోని బౌద్ధ ఆలయాలను సందర్శిస్తారు. రాత్రికి గయలోనే బస ఉంటుంది.
- తర్వాతి రోజు ఉదయం విష్ణు పదం ఆలయం, మంగళ గౌరీ శక్తిపీఠం వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో వారణాసికి బయల్దేరతారు. ఏడు గంటల ప్రయాణం తర్వాత వారణాసి చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయి రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు.
- మూడో రోజు ఉదయం పవిత్ర గంగా నదిలో స్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. గంగా హారతి, స్థానిక ఆలయాలు సందర్శిస్తారు. ఘాట్‌లు, ఇరుకైన సందుల్లో బస్సులు వెళ్లేందుకు వీలు ఉండదు కాబట్టి యాత్రికులే తమ సొంత ఖర్చులతో ఆటో లేదా రిక్షా బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మూడో రోజు కూడా వారణాసిలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు బౌద్ధ వారసత్వ ప్రదేశాల్లో ముఖ్యమైన సారనాథ్‌ను సందర్శిస్తారు. సందర్శన తర్వాత హోటల్‌కు తిరిగి వస్తారు. ఆరోజు ఏదైనా షాపింగ్, ఇతర వ్యక్తిగత పనులు ఉంటే చూసుకోవచ్చు. రాత్రి అక్కడే స్టే ఉంటుంది.
- ఐదోరోజు ఉదయం లేవగానే ఫ్రెష్ అవుతారు. వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరతారు. ఆలోపీ దేవి ఆలయం, పవిత్ర త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అనంతరం అయోధ్యకు పయనమవుతారు. రాత్రి అయోధ్యలో బస చేస్తారు.
- ఆరో రోజు బాలరాముడిని దర్శించుకుని సమీపంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి లక్నో బయల్దేరుతారు. రాత్రికి లక్నో చేరుకుని అక్కడే బస చేస్తారు.
- ఏడో రోజు ఉదయం లక్నో సమీపంలోని పురాతన పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం హోటల్‌కు చేరుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
- ఎనిమిదో రోజు అల్పాహారం తర్వాత హెటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోలోని బారా ఇమాంబారాను సందర్శిస్తారు. ఆ తర్వాత ఫ్లైట్‌లో లక్నో నుంచి రాత్రి 8:45 గంటలకు బయల్దేరుతారు. 10:45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి యాత్రికులు తమ ఇళ్లకు వెళ్లిపోతారు. దీంతో యాత్ర ముగుస్తుంది.
- మొత్తంగా గయలో ఒక రాత్రి, వారణాసిలో మూడు రాత్రులు, అయోధ్యలో ఒక రాత్రి, లక్నోలో రెండు రాత్రుల బస ఉంటుంది.
ప్యాకేజీ ధరలు..
ఈ టూర్ ప్యాకేజీ ధరలను వాళ్లు ఎంచుకునే రూమ్ షేరింగ్ (Occupancy) విధానం ఆధారంగా నిర్ణయిస్తారు. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.54,800 ఖర్చవుతుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.41,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.38,750గా నిర్ణయించారు.
ప్యాకేజీలో ఏమేం కవర్ అవుతాయంటే..?
గంగా గయా సంగం యాత్ర ప్యాకేజీలో హైదరాబాద్-గయ , లక్నో-హైదరాబాద్ రానుపోను విమాన టిక్కెట్లు, 7 రాత్రుల హోటల్ వసతి, 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 7 డిన్నర్లు, ఒకసారి మధ్యాహ్న భోజనం అందిస్తారు. దీంతోపాటూ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శనల కోసం ఏసీ బస్సు సౌకర్యం, ప్రయాణ బీమా , ఒక టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలు ఉంటాయి. అయితే ఆలయ ప్రవేశ రుసుములు, అదనపు భోజనాలు, స్థానిక రవాణా ఛార్జీలు, ప్రత్యేక పూజలు, టిప్‌లు , లాండ్రీ వంటివి ప్రయాణికులే స్వయంగా భరించాల్సి ఉంటుంది.
Also Read..
వీపీఎన్ అంటే ఏమిటి.. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని సేఫ్‌గా ఎలా వాడాలి..?
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
సంబంధిత వార్తలు

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026

Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
అక్టోబర్ 3, 2026

Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
- ●Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
- ●Primebook 3 Max | రూ.35,990కే ప్రైమ్బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్

Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి



