త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | వికసిత్‌ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్ర‌ధాని మోదీ

PM Modi | నేడు రాజ్యాంగ దినోత్స‌వం (Indian Constitution Day) సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు (Indian citizens) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్ష‌లు తెలిపారు.

D

National | Published On Nov 26, 2026, 11.53 am IST

PM Modi | వికసిత్‌ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఒక అమూల్యమైన వారసత్వ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. నేడు రాజ్యాంగ దినోత్స‌వం (Indian Constitution Day) సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు (Indian citizens) ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"మన రాజ్యాంగ నిర్మాతలు అందించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి ఒక అమూల్యమైన వారసత్వం. 2047 నాటికి వికసిత భారత్ ల‌క్ష్యాన్ని నెరవేర్చడంలో ఇది నిరంతరం మార్గనిర్దేశం చేస్తుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను మరింత బలోపేతం చేసుకునేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటించుకునే సందర్భం ఇది. అనేక మంది కలిసి ఆలోచించి, జాగ్రత్తగా రూపొందించిన భావాల రూపమే మ‌న‌ రాజ్యాంగం" అని ప్ర‌ధాని రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడారు.

Also Read..

ఎలాన్ మస్క్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌తి అమెరిక‌న్ చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..

దేవుడు ఎంచుకున్న వృష‌క‌ర్మ నువ్వు - హాలీవుడ్ లెవెల్‌లో నాగ‌చైత‌న్య మూవీ ట్రైల‌ర్‌

ఉద్యోగాలు క‌ల్పించ‌డం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్‌

Advertisement
Advertisement