త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | పాకిస్థాన్‌ కంటెంట్‌ను భారత్​లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

Web Series | పాకిస్థాన్ వెబ్ సిరీస్‌ (Web Series) జో బచే హై సంగ్ సమైత్ లో (Jo Bachay Hain Sang Samait Lo) వివాదం నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్థాన్‌లో రూపొందించిన ఎలాంటి కంటెంట్ (సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు) భారత్‌లో స్ట్రీమింగ్ కాకుండా చూడాలని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

D

National | Published On Nov 26, 2026, 1.44 pm IST

Web Series | పాకిస్థాన్‌ కంటెంట్‌ను భారత్​లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
Advertisement

Web Series | త్రినేత్ర న్యూస్ : పాకిస్థాన్ ఫ‌స్ట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వెబ్‌సిరీస్ (Web Series)గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ జో బచే హై సంగ్ సమైత్ లో (Jo Bachay Hain Sang Samait Lo)ను నిషేధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్‌లో పాకిస్థాన్ కంటెంట్ స్ట్రీమింగ్‌పై ఆంక్ష‌లు విధించింది. పాకిస్థాన్‌లో రూపొందించిన ఎలాంటి కంటెంట్ (సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు) భారత్‌లో స్ట్రీమింగ్ కాకుండా చూడాలని ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

ఈ విష‌యంలో మే 8, 2025 నాటి ఉత్తర్వులను పాటించాల‌ని సూచించింది. కంటెంట్ ప్ర‌సారం విష‌యంలో గ‌తేడాది జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లోని తమ సబ్‌స్క్రైబర్లకు పాకిస్థాన్‌కు చెందిన ఏ సినిమాను గానీ, వెబ్ సిరీస్‌ను గానీ అందుబాటులో ఉంచలేదని గత ఏడాది జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన విష‌యం తెలిసిందే. నాడు తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు సూచించింది.

పాకిస్థాన్ ఫ‌స్ట్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌గా జో బచే హై సంగ్ సమైత్ లో డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హానియా అమీర్, సనమ్ సయీద్ తో పాటు ప‌లువురు పాకిస్థాన్ స్టార్స్ ఈ సిరీస్‌లో న‌టించ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. దీంతో వెబ్‌సిరీస్‌పై వివాదం మొద‌లైంది. ఈ పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియ‌న్ సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాని మోదీకి ఓ లేఖ‌ను రాసింది. అమ‌ర‌వీరుల కుటుంబాల మ‌నోభావాల‌తో పాటు జాతీయ భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్‌ను ఇండియాలో రిలీజ్ చేయ‌ద్ద‌ని కోరుతున్నామ‌ని ఈ లేఖ‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్ ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు రూపొందించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లు టీవీల్లో ఓటీటీల‌లో టెలికాస్ట్ కాకుండా క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను తీసుకురావాల‌ని సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సురేష్ శ్యామ్‌లాగ్ గుప్తా డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Also Read..

ర‌న్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్‌.. భారత సైన్యం అసాధార‌ణ ఫీట్..!

26/11 ముంబై ఉగ్ర‌దాడి.. అమ‌రుల‌కు ప్ర‌ముఖుల నివాళులు

వికసిత్‌ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement