Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
Drug-Free India Awareness March | డ్రగ్స్ (Drugs) బారిన పడిన పిల్లలు, కాలేజీ విద్యార్థులు (Students) ప్రతి 15 రోజులకోసారి దాదాపు 80 నుంచి 100 మంది వస్తున్నారని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి (Dr. T. Usha Rani) తెలిపారు.
Drug-Free India Awareness March | త్రినేత్ర న్యూస్: డ్రగ్స్ (Drugs) బారిన పడిన పిల్లలు, కాలేజీ విద్యార్థులు (Students) ప్రతి 15 రోజులకోసారి దాదాపు 80 నుంచి 100 మంది వస్తున్నారని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ (Hyderabad Gandhi Hospital) సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి (Dr. T. Usha Rani) తెలిపారు. వారిపట్ల వివక్ష చూపొద్దని కోరారు. వారితో స్నేహంగా మెసులుకొని వారిని డ్రగ్స్ బారి నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ పాదయాత్ర (Drug-Free India Awareness March) సందర్భంగా గురువారం ఆమె మాట్లాడారు.
డీ-అడిక్షన్ సెంటర్‌తో ఉచిత చికిత్స అందిస్తున్నం
నషా ముక్త్ భారత్‌కు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. నశాముక్త్ భారత్ అభియాన్ కోసం ఇంత పెద్ద ఎత్తున మహత్తరమైన పాదయాత్ర నిర్వహించడం చాలా అభినందనీయం. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి, అవి మన దేశానికి చేసే నష్టాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా చక్కగా వివరించారు. డ్రగ్స్ బారిన పడి మా దగ్గరికి వచ్చేవారి కోసం గాంధీ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా డీ-అడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ టెస్టింగ్, మందులు, చికిత్స అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం.
డ్రగ్స్ బారిన పడిన వారి పట్ల వివక్ష చూపకుండా, సానుభూతితో అండగా నిలబడి వారిని ఆ బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అవగాహన కల్పిస్తూ యువతను కాపాడుకునే ఈ నషా ముక్త్ భారత్ అభియాన్‌కు గాంధీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, విద్యార్థుల తరఫున మా సంపూర్ణ సహకారాన్ని తెలియజేస్తున్నాం అని ఉషారాణి అన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
- ●Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్
- ●26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు
- ●TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం
- ●NSE | చరిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్గా రికార్డు..
- ●PM Modi | వికసిత్ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్రధాని మోదీ

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..

Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్

26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు

TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం






