త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Army microlight aircraft | ర‌న్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్‌.. భారత సైన్యం అసాధార‌ణ ఫీట్..!

Indian Army microlight aircraft | భార‌త సైన్యం (Indian Army) అసాధార‌ణ‌ ఘ‌న‌త సాధించింది. గుజరాత్‌లోని అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్ (NH-754A / NH-754K) పై నాలుగు సైనిక విమానాలతో ల్యాండింగ్‌, టేకాఫ్‌, రీఫ్యూయ‌లింగ్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది.

D

National | Published On Nov 26, 2026, 1.04 pm IST

Indian Army microlight aircraft | ర‌న్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్‌.. భారత సైన్యం అసాధార‌ణ ఫీట్..!
Advertisement

Indian Army microlight aircraft | త్రినేత్ర న్యూస్ : భార‌త సైన్యం (Indian Army) అసాధార‌ణ‌ ఘ‌న‌త సాధించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సమన్వయంతో గుజరాత్ (Gujarat)లోని అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్ (NH-754A / NH-754K) పై నాలుగు సైనిక విమానాలతో ల్యాండింగ్‌, టేకాఫ్‌, రీఫ్యూయ‌లింగ్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది. భారత సైన్యానికి చెందిన టీమ్ మౌంటెన్ ఈగల్స్ (Team Mountain Eagles) ఈ విన్యాసాల్లో పాల్గొనింది.

గుజరాత్‌లోని పాటన్ జిల్లా, శాంతల్‌పూర్ తహసీల్‌లోని బకుత్ర టోల్ ప్లాజా సమీపంలో సుమారు 3 కి.మీ. ప‌రిధిలో ఈ విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాల కోసం ఎక్స్-ఎయిర్ 'హనుమాన్', సవన్నా MXP 740 మైక్రోలైట్ విమానాలతో పాటు టానార్గ్ బయోనిక్స్, నువిక్స్ స్కైప్పర్ పవర్డ్ హ్యాంగ్ గ్లైడర్ల‌ను ఉప‌యోగించారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్ (Mhow) లో ఉన్న ఆర్మీ అడ్వెంచర్ నోడల్ సెంటర్ నిర్వహిస్తున్న 'వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్' (Wings of Valour and Unity Expedition) లో భాగంగా ఈ విన్యాసాలు చేప‌ట్టారు. ఈ విన్యాసాల‌కు భద్రత, ట్రాఫిక్ నిర్వహణలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తోడ్పాటు అందించింది.

ల్యాండింగ్, టేకాఫ్‌, రీఫ్యూయ‌లింగ్‌.. ఫ‌స్ట్‌టైమ్‌

విన్యాసాల‌కు ముందు NHAI సాంకేతిక బృందాలు రహదారిని తనిఖీ చేశాయి. విమానాలు దిగడానికి రోడ్డు ఉపరితలం అనువుగా ఉందో లేదో పరీక్షించాయి. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ ను తాత్కాలికంగా నిలిపివేసి, వాహనాలను ఇతర దారిలో మళ్లించారు. ఆర్మీ గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది హైవేపైనే మొబైల్ రీఫ్యూయలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. జాతీయ రహదారిపై నాలుగు విమానాల బృందంతో విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్‌, ఇంధనం నింపడం నిర్వహించడం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

నితిన్ గ‌డ్క‌రీ హ‌ర్షం..

భార‌త సైన్యం అసాధార‌ణ ఫీట్‌కు సంబంధించిన వీడియోని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. భారత సైన్యం, NHAI మధ్య సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం చారిత్రాత్మకమని చెప్పారు. దేశంలోని జాతీయ రహదారులు కేవలం రవాణా అవసరాలకే కాకుండా.. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాల వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. పర్యాటకం, ఏరో అడ్వెంచర్ కార్యకలాపాలకు సైతం భద్రతా ప్రమాణాలు, తగిన సమన్వయంతో వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

Also Read..

26/11 ముంబై ఉగ్ర‌దాడి.. అమ‌రుల‌కు ప్ర‌ముఖుల నివాళులు

వికసిత్‌ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్ర‌ధాని మోదీ

నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..

Advertisement
Advertisement