Vrushakarma Trailer | దేవుడు ఎంచుకున్న వృషకర్మ నువ్వు – హాలీవుడ్ లెవెల్‌లో నాగచైతన్య మూవీ ట్రైలర్
నాగచైతన్య హీరోగా నటించిన వృషకర్మ ట్రైలర్ గురువారం రిలీజైంది. భక్తి, హారర్, వీఎఫ్ఎక్స్ అంశాలతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. వృషకర్మ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దర్వకత్వం వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Nov 26, 2026, 11.30 am IST
Vrushakarma Trailer | నాగచైతన్య హీరోగా నటించిన వృషకర్మ మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. హారర్, భక్తి అంశాలతో ఈ ట్రైలర్ ఉత్కంఠను పంచింది. విజువల్స్ హాలీవుడ్ సినిమా లెవెల్‌లో ఉన్నాయి.
ఐదు వేల సంవత్సరాల క్రితం....
తవ్వకాల్లో బయటపడ్డ ఓ గుహలో ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి కొన్ని చెక్కిన కొన్ని ఆకారాలు, ఓ విగ్రహం మిస్టరీతో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఒక అతీంద్రియ శక్తిని ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడిగా నాగచైతన్య కనిపించారు. సృష్టిధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తూ ఆ దైవం ఎంచుకున్న వృషకర్మవు నువ్వు అంటూ ట్రైలర్‌లోని డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎమ్ ఆకట్టుకుంటున్నాయి.
బాలీవుడ్ నటుడు...
ఈ ట్రైలర్‌తో వృషకర్మపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా నటించారు. కియారా ఖన్నా, జయరామ్ కీలక పాత్రను పోషించారు.
ఫస్ట్ హీరో అతడే....
వృషకర్మ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను బుధవారం నెల్లూరులో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ ‘వృషకర్మ’ కథ కార్తీక్ చెప్పినప్పుడు నిజానికి ఈ సినిమాకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. అంత ఒరిజినల్‌గా రాశారు. చాలా ఫ్రెష్ ఐడియా. ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. సినిమా రెండు గంటల 50 నిమిషాలు ఉంటే, దాదాపు ప్రతి ఫ్రేమ్‌లో ఏదో ఒక వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు ఉంటాయి. అలాంటి అద్భుతమైన విజన్‌ను డైరెక్టర్ కార్తీక్ తీసుకొచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో డైరెక్టరే. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు వచ్చి ఇండియా అంతటా తమ సత్తా చాటారు. ఆ లిస్టులో కార్తీక్ కూడా చేరబోతున్నారు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఒక సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం అని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mrunal Thakur | బ్లాక్ సూట్లో మృణాల్ ఠాకూర్.. స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న సీతారామం బ్యూటీ!
నవంబర్ 25, 2026

OTT Release This Week | ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఆరు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ..!
నవంబర్ 25, 2026

Satvika Veeravalli | కార్పొరేట్ కొలువు నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. హాట్ టాపిక్‌గా మారిన టాలీవుడ్ బ్యూటీ!
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Elon Musk | ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. ప్రతి అమెరికన్ చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..
- ●KTR | ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలకు భారీ బూస్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలు పెరుగుదల.. కారణాలేమిటి..?
- ●Ramayana | ఆస్కార్ రేసులో రామాయణ - వీఎఫ్ఎక్స్ కేటగిరీలో అవెంజర్స్, ఒడిస్సీ సినిమాలతో పోటీ
- ●Stock Markets | ఐటీ షేర్ల జోరు.. స్టాక్ మార్కెట్లలో లాభాలు..
- ●Birth Certificate | ఓటరు జాబితాలో తండ్రి పేరు లేదని.. అప్పుడే పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ నిరాకరణ

Elon Musk | ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. ప్రతి అమెరికన్ చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..

KTR | ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్

Gold And Silver Prices Today | బంగారం ధరలకు భారీ బూస్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలు పెరుగుదల.. కారణాలేమిటి..?

Ramayana | ఆస్కార్ రేసులో రామాయణ - వీఎఫ్ఎక్స్ కేటగిరీలో అవెంజర్స్, ఒడిస్సీ సినిమాలతో పోటీ



