FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
FII Buying | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) నవంబర్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు రూ.1.22 లక్షల కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకొచ్చారు. వరుసగా 17 ట్రేడింగ్ సెషన్ల పాటు కొనుగోళ్లు కొనసాగించగా, అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికే పెట్టుబడులు కేటాయించారు. మరోవైపు క్యాపిటల్ గూడ్స్ రంగంలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
FII Buying | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) నవంబర్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు రూ.1.22 లక్షల కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకొచ్చారు. వరుసగా 17 ట్రేడింగ్ సెషన్ల పాటు కొనుగోళ్లు కొనసాగించగా, అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికే పెట్టుబడులు కేటాయించారు. మరోవైపు క్యాపిటల్ గూడ్స్ రంగంలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. నవంబర్ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.1.22 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు వెల్లడించాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక నెలలో నమోదైన అత్యధిక విదేశీ పెట్టుబడులుగా ఇది నిలిచింది. గతంలో 2020 నవంబర్‌లో రూ.70,896 కోట్ల పెట్టుబడులు రావడం రికార్డుగా ఉండేది. ఈసారి నవంబర్ 25 వరకు వరుసగా 17 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. నవంబర్ 23న రూ.5,673 కోట్లు, నవంబర్ 25న రూ.4,479 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. ఈ రెండు సెషన్లలో కలిపి రూ.10,152 కోట్ల పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి. నవంబర్ 25న స్థూల కొనుగోళ్ల విలువ రూ.24,310 కోట్లుగా నమోదైంది.
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికే సింహభాగం..
రంగాల వారీగా పెట్టుబడులను పరిశీలిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం విదేశీ ఇన్వెస్టర్ల మొదటి ప్రాధాన్యంగా నిలిచింది. నవంబర్ 15 నాటికి ఈ రంగంలోకి రూ.43,102 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.84,291 కోట్ల రంగాలవారీ నికర ఈక్విటీ పెట్టుబడుల్లో ఇది సుమారు 51 శాతంగా ఉంది. టెలికాం రంగంలో రూ.7,570 కోట్లు, ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో రూ.7,551 కోట్లు, కన్స్యూమర్ సర్వీసెస్ రంగంలో రూ.6,519 కోట్లు, ఐటీ రంగంలో రూ.5,080 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి భారీగా నిధులు తరలించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
క్యాపిటల్ గూడ్స్ రంగంలో భారీ అమ్మకాలు..
మరోవైపు క్యాపిటల్ గూడ్స్ రంగం విదేశీ పెట్టుబడుల విషయంలో వెనుకబడింది. నవంబర్ 15 నాటికి ఈ రంగం నుంచి రూ.3,781 కోట్ల నికర పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. కెమికల్స్ రంగంలో రూ.370 కోట్లు, టెక్స్టైల్స్ రంగంలో రూ.98 కోట్ల నికర అమ్మకాలు నమోదయ్యాయి. ఫారెస్ట్ మెటీరియల్స్ రంగం నుంచి రూ.10 కోట్లు, డైవర్సిఫైడ్ రంగాల నుంచి రూ.8 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ కాలంలో కేవలం ఐదు రంగాల్లో మాత్రమే నికర పెట్టుబడుల ఉపసంహరణ నమోదైంది. మిగిలిన రంగాల్లో కొనుగోళ్ల ధోరణి కనిపించగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం అత్యధిక పెట్టుబడులను ఆకర్షించింది.
తాజావార్తలు
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష






