త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఉద్యోగాలు క‌ల్పించ‌డం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్‌

KTR | ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్‌ కాదని.. చాయ్ తాగుతూ (Irani chai) చేసే ప‌బ్లిసిటీ స్టంట్ అంత‌కంటే కాదంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిప‌డ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే దార్శనికత, నిబద్ధత ఉండాలని చెప్పారు.

G

Telangana | Published On Nov 26, 2026, 11.30 am IST

KTR | ఉద్యోగాలు క‌ల్పించ‌డం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్‌ కాదని.. చాయ్ తాగుతూ (Irani chai) చేసే ప‌బ్లిసిటీ స్టంట్ అంత‌కంటే కాదంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిప‌డ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే దార్శనికత, నిబద్ధత ఉండాలని చెప్పారు. మూడేండ్ల క్రిత అశోక్ న‌గ‌ర్‌కు (Ashok Nagar) వ‌చ్చి ఫొటోల‌కు ఫోజులిస్తూ ఆకాశ‌మే హ‌ద్దుగా హామీలు ఉప్పించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నాడు తెలంగాణ కోసం కొట్లాడిన యుత.. నేడు ఉద్యోగాల కోసం పోరాడుతున్నార‌ని ఎక్స్ వేదిక‌గా చెప్పారు.

‘రాహుల్ గాంధీ.. మూడేండ్ల‌ క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మీరు ఒక నాటకానికి తెరలేపారు. నాటకీయ లైటింగ్‌ మధ్య ఇరానీ చాయ్‌ తాగుతూ, ఫొటోలకు ఫోజులిస్తూ, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. మూడేళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది. రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య. యువ వికాసం (Yuva Vikasam) ఒక మిరాజ్‌. మీ జాబ్‌ క్యాలెండర్‌ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉంది. ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్‌ కాదు. చాయ్‌ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ (PR stunt) అంతకంటే కాదు. ఉద్యోగాలు కల్పించాలంటే దార్శనికత ఉండాలి. కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా అచంచలమైన నిబద్ధత ఉండాలి.

ఉద్యోగాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారు. మీరు, మీ మొత్తం విదూషకుల బృందం తెలంగాణ యువతకు ఏమీ చేయలేరని పదేపదే నిరూపించుకున్నారు. కానీ రాహుల్‌ గాంధీ గారూ.. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ కోసం నిరంకుశ కాంగ్రెస్‌తో పోరాడిన యువత మళ్లీ పోరాడగలదు. కాంగ్రెస్‌ దుష్ట కబంధ హస్తాల నుంచి తెలంగాణను మరోసారి విముక్తి చేయడానికి వారు పోరాడుతారు. ఇది కేసీఆర్‌ గడ్డ! ఇది పోరాట యోధుల గడ్డ. పోరాట యోధులు ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement