త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..

Nifty 50 | నిఫ్టీ 50 సూచీ గత నెల రోజుల్లో 13 శాతానికి పైగా లాభపడింది. అయితే 26,000-26,300 పాయింట్ల కీలక నిరోధ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి భారీ ర్యాలీకి అవకాశం ఉంటుందని సీఎల్ఎస్ఏ సాంకేతిక విశ్లేషకుడు లారెన్స్ బాలాంకో అంచనా వేశారు. ఈ అడ్డంకిని బలంగా దాటితే నిఫ్టీ 31,600-31,700 స్థాయికి చేరుకుంటుంద‌ని పేర్కొన్నారు.

S

Business | Published On Nov 26, 2026, 12.53 pm IST

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
Advertisement

Nifty 50 | నిఫ్టీ 50 సూచీ గత నెల రోజుల్లో 13 శాతానికి పైగా లాభపడింది. అయితే 26,000-26,300 పాయింట్ల కీలక నిరోధ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి భారీ ర్యాలీకి అవకాశం ఉంటుందని సీఎల్ఎస్ఏ సాంకేతిక విశ్లేషకుడు లారెన్స్ బాలాంకో అంచనా వేశారు. ఈ అడ్డంకిని బలంగా దాటితే నిఫ్టీ 31,600-31,700 స్థాయికి చేరుకుంటుంద‌ని పేర్కొన్నారు.

నిఫ్టీ కీల‌క నిరోధ స్థాయిలు ఇవే..

భారత స్టాక్ మార్కెట్లలో ఇటీవల కనిపిస్తున్న ర్యాలీ మరింత కొనసాగేందుకు అవకాశాలున్నాయని సీఎల్ఎస్ఏ సాంకేతిక విశ్లేషకుడు లారెన్స్ బాలాంకో అభిప్రాయపడ్డారు. అయితే స్వల్పకాలంలో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనవుతూ, లాభాల స్వీకరణతో స్థిరీకరణ దశలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. తన తాజా మార్కెట్ విశ్లేషణలో నిఫ్టీ 50 సూచీకి 26,000-26,300 పాయింట్ల స్థాయిని కీలక నిరోధ ప్రాంతంగా గుర్తించారు. 2024 నుంచి ఈ స్థాయిని సూచీ నిర్ణయాత్మకంగా అధిగమించలేదని, ప్రస్తుత మార్కెట్ రికవరీకి ఇదే ప్రధాన పరీక్షగా మారనుందని వివరించారు. గత నెల రోజుల్లో నిఫ్టీ 13 శాతానికి పైగా లాభపడడంతో ఈ నిరోధ స్థాయికి చేరువైంది.

కింద‌కు క‌దిలితే మ‌ద్ద‌తు ఎక్క‌డ‌..?

మరోవైపు మార్కెట్ దిగువకు కదిలితే నిఫ్టీకి మొదటి మద్దతు 25,054-25,104 పాయింట్ల మధ్య ఉంటుందని బాలాంకో అంచనా వేశారు. ఈ స్థాయిని కూడా అధిగమించి మరింత కరెక్షన్ వస్తే 24,601-24,773 పాయింట్ల తదుపరి మద్దతు ప్రాంతాన్ని పరీక్షించే అవకాశం ఉందన్నారు. ఈ స్థాయిలు గత ఏప్రిల్, జూలై నెలల్లో నమోదైన గరిష్ఠ స్థాయిలకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషించారు. అయితే దీర్ఘకాలిక మార్కెట్ ధోరణిపై బాలాంకో సానుకూలంగానే ఉన్నారు. 2024 నుంచి నిఫ్టీ ఒక నిర్దిష్ట ట్రేడింగ్ పరిధిలో కొనసాగడాన్ని మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరిన సంకేతంగా కాకుండా, భవిష్యత్తులో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్ మళ్లీ ప్రారంభమయ్యేందుకు పునాదిగా ఆయన అభివర్ణించారు. 26,000-26,300 పాయింట్ల నిరోధాన్ని నిఫ్టీ బలంగా అధిగమిస్తే తదుపరి లక్ష్యం 31,600-31,700 పాయింట్లుగా ఉంటుంద‌ని అంచనా వేశారు. ప్రస్తుతానికి మార్కెట్లు కొంతకాలం స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని, తదుపరి దిశను కీలక నిరోధ స్థాయిని ఎంత బలంగా అధిగమిస్తుందనే అంశం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement