త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elon Musk | ఎలాన్ మస్క్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌తి అమెరిక‌న్ చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..

Elon Musk | అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్‌కు చెందిన రెండు షేర్ల‌ను అందించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందులో ఒక షేరును కంపెనీ ఇవ్వనుండగా, మరో షేరును ఆయన వ్యక్తిగతంగా అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన పిల్లలకు షేర్లు పంపిణీ చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు ప్రారంభించింది.

S

Business | Published On Nov 26, 2026, 11.39 am IST

Elon Musk | ఎలాన్ మస్క్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప్ర‌తి అమెరిక‌న్ చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..
Advertisement

Elon Musk | అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్‌కు చెందిన రెండు షేర్ల‌ను అందించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందులో ఒక షేరును కంపెనీ ఇవ్వనుండగా, మరో షేరును ఆయన వ్యక్తిగతంగా అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన పిల్లలకు షేర్లు పంపిణీ చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు ప్రారంభించింది.

అమెరికాలోని ప్ర‌తి చిన్నారికి 2 స్పేస్ ఎక్స్ షేర్లు..

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్‌కు చెందిన రెండు షేర్లు అందించనున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రతి అమెరికన్ చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు ఇస్తామని, అందులో ఒకటి కంపెనీ తరఫున, మరొకటి తన వ్యక్తిగత వాటా నుంచి అందించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు స్పేస్‌ఎక్స్ కూడా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్రతి ట్రంప్ అకౌంట్‌కు కొత్తగా జారీ చేసిన క్లాస్-ఎ కామన్ స్టాక్‌లో ఒక షేరును అందించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చే మొత్తం షేర్ల సంఖ్యకు సమానంగా తాను కూడా వ్యక్తిగతంగా షేర్లను అందిస్తానని మస్క్ వెల్లడించారు.

https://twitter.com/elonmusk/status/2125797463047258119

ఎవ‌రికి ఇస్తారు..?

ఇప్పటికే అక్టోబర్ 30న స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్నే షాట్‌వెల్ ఎక్స్‌లో చేసిన ప్రకటన ప్రకారం.. అర్హులైన చిన్నారులకు డిసెంబర్‌లో 20 లక్షలకు పైగా షేర్లు పంపిణీ చేయనున్నారు. ఈ షేర్లను ఎస్క్రో ఖాతాలోకి బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కుటుంబాల మధ్యస్థ వార్షిక ఆదాయం 57వేల డాలర్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న జిప్ కోడ్ ప్రాంతాల్లో నివసించే 11 నుంచి 17 ఏళ్ల పిల్లలు ఈ పథకానికి అర్హులు. మధ్యస్థ కుటుంబ ఆదాయాన్ని లెక్కించేందుకు తగిన జనాభా లేని ప్రాంతాల్లోని పిల్లలకు కూడా అర్హత కల్పించనున్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రకటన వెలువడిన తరువాతి సోమవారం నాటికి సమాచారం అందుతుందని షాట్‌వెల్ వెల్లడించారు.

సైనిక కుటుంబాల పిల్ల‌ల‌కు సైతం..

కాగా విదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనిక కుటుంబాల పిల్లలు, ఫోస్టర్ కేర్‌లో ఉన్న చిన్నారులు, అలాగే అర్హత కలిగిన టెక్సాస్ కౌంటీల్లో కుటుంబ వార్షిక ఆదాయం 90వేల డాలర్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మరో షేర్ల విరాళాన్ని కూడా అందించనున్నట్లు షాట్‌వెల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి పంపిణీ విధానం, మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్లు కూడా ట్రంప్ అకౌంట్ల ద్వారానే అందిస్తారా? వాటిపై లాక్‌-అప్ నిబంధనలు ఉంటాయా? అనే విషయాలపై స్పేస్‌ఎక్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల విలీన అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఈ నెల ప్రారంభంలో మస్క్ వెల్లడించారు. అయితే విలీనానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందానికి రాలేదని, భవిష్యత్తులో ఒప్పందం కుదిరే అవ‌కాశాలు కూడా లేవ‌ని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement