త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | నేను మాట్లాడేది 28 ఏళ్ల యువకుల గురించి.. రాహుల్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని విమ‌ర్శ‌లు

PM Modi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల‌కు ముందు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం, అలాగే పార్లమెంట్ సమావేశాలు రెండూ దేశానికి ఫలప్రదంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

D

National | Published On Jul 20, 2026, 12.01 pm IST

PM Modi | నేను మాట్లాడేది 28 ఏళ్ల యువకుల గురించి.. రాహుల్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని విమ‌ర్శ‌లు
Advertisement

PM Modi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల‌కు ముందు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం, అలాగే పార్లమెంట్ సమావేశాలు రెండూ దేశానికి ఫలప్రదంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అంత‌రాయం, గంద‌ర‌గోళం లేకుండా స‌భా కార్య‌క‌లాపాలు స‌జావుగా సాగాల‌ని ఆకాంక్షించారు. అదే స‌మ‌యంలో దేశ యువ‌త సాధిస్తున్న అద్భుత విజయాలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో యువత ప్రదర్శిస్తున్న ప్రతిభ, అంకితభావం అసాధారణమైనవని మోదీ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా 'స్కైరూట్ ఏరోస్పేస్' (Skyroot Aerospace) రూపొందించిన 'విక్రమ్-1' ప్రయోగం వెనుక ఉన్న యువ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. తాను "56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు" అంటూ లోక్‌స‌భలో ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప‌రోక్షంగా విమ‌ర్శించారు. విక్ర‌మ్ విజయం భారత యువ ఆవిష్కర్తల అపారమైన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. స్కైరూట్‌లో పనిచేస్తున్న యువత సగటు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొన్నారు.

"కేవలం ఒక్క నెలలోనే దేశం ఎన్నో మైలురాళ్లను సాధించింది. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు మ‌నం సాధించిన విజ‌యాలు దేశానికి గ‌ర్వ‌కార‌ణం. ముఖ్యంగా భారత యువత సాధిస్తున్న విజయాలు ప్రపంచ వేదికపై దేశ ప్ర‌భావాన్ని పెంచుతున్నాయి. జగత్తు అంతటా నమ్మకాన్ని నింపుతున్నాయి" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో గ‌త పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు ముందు భార‌తీయ వ్యోమ‌గామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రైవేట్ భార‌తీయ స్టార్ట‌ప్ సాధించిన విజ‌యం మ‌రొక చారిత్రాత్మ‌క ఘ‌ట్ట‌మ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు."ఈ గ్లోబల్ గుర్తింపు యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఇదొక శక్తిమంతమైన సందేశం. మన దేశ యువత సామర్థ్యం, ఆకాంక్షలు అంతరిక్షం వలె అపరిమితమైనవి అనడానికి ఇంతకంటే స్ఫూర్తిదాయకమైన సందేశం మరొకటి ఉండదు" అని ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు.

వృద్ధిలో దేశం వేగం పుంచుకుంది..

ఇదే సమయంలో దేశం సాధించిన ఇతర విజయాలను కూడా ప్రధాని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. రాజస్థాన్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని దేశానికి అంకితం చేశామని వెల్లడించారు. ఒక సెమీ కండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించామని తెలిపారు. ప‌శ్చిమాసియా సంక్షోభాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని భార‌త్ బ‌ల‌మైన వృద్ధిని సాధించింద‌ని చెప్పారు. యుద్ధంతో చాలా దేశాలకు నష్టం జరుగుతోందని చెప్పారు. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని వివరించారు. ఇంత‌టి సంక్షోభంలోనూ భార‌త్‌ 7.7శాతం గ్రోత్‌రేట్ భారత్ నమోదు చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "దేశం మంచి వేగాన్ని పుంజుకుంది. పార్లమెంట్ స్ఫూర్తి ఆ వేగానికి మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది" అని పేర్కొన్నారు.

Also Read..

మెల్‌బోర్న్‌లో ఘ‌నంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా 12వ వార్షికోత్స వేడుక‌లు..

పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం.. వెంట‌నే లోక్‌స‌భ వాయిదా

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గుతుందా..?

Advertisement
Advertisement