NRI BRS Australia | మెల్‌బోర్న్‌లో ఘనంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా 12వ వార్షికోత్స వేడుకలు..
NRI BRS Australia | ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (NRI BRS Australia) 12వ వార్షికోత్సవ వేడుకలను మెల్‌బోర్న్‌లో (Melbourne) ఘనంగా నిర్వహించారు.
NRI BRS Australia | త్రినేత్ర.న్యూస్: ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (NRI BRS Australia) 12వ వార్షికోత్సవ వేడుకలను మెల్‌బోర్న్‌లో (Melbourne) ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి (Anil Bireddy) ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న పలువురు ఎన్నారైలకు అనిల్ బైరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిశా, నిర్దేశం మేరకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు.

రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో కూడా 12వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడంతో పాటు పార్టీ అభిమానులను, కేసీఆర్ (KCR), కేటీఆర్ అభిమానులను సమన్వయం చేస్తామని తెలిపారు. పన్నెండేండ్లుగా పార్టీకి సేవ చేసే అవకాశమిచ్చి ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కార్యవర్గ సభ్యులు, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలకు, మీడియా సంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం..
కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేస్తున్న అసత్య ప్రచారాల్ని తిప్పి కొట్టాలని పిలుపునిస్తూ వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోని ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే ఎన్నారైలు కూడా ఎస్ఐఆర్ (SIR)పై అవగాహన కలిగి ఉండాలని వివరించారు.

గత పదేండ్లలో తెలంగాణ (Telangana) ఎంతగా అభివృద్ధి చెందిందో వీడియో రూపంలో చూపించి సభకు వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అరాచక పాలనలో తెలంగాణ నష్టపోతున్న విధానాన్ని, ప్రజల దీన పరిస్థిని వివరించారు. కేసీఆర్ అప్పుచేసి అభివృద్ధి, సంక్షేమ చేస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులతో స్కాములు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యం..
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీని మరోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యడమే సంకల్పంగా ముందుకు వెళ్తామన్నారు. దీనికోసం ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఎంతోమంది ఎన్నారైలు పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని, వారందరిని కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు, ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని అనిల్ బైరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సీనియర్ నాయకులు రమేష్ ముత్యాల, మధుపర్సా, రాహుల్ నడిదే, సత్య గుండా, రవీందర్ చుక్క, కార్తీక్, కుల్విందర్ గాజువా, స్వప్న, ప్రియాంక, మధు, ఇతర ముఖ్య నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..






