Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
Mahesh Kumar Goud | దేశ యువత ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ తల వంచక తప్పలేదని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
- టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : దేశ యువత ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ తల వంచక తప్పలేదని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన్ రాజీనామాపై టీ పీసీసీ చీఫ్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
ప్రజాస్వామ్యంలో నియంత పోకడకు తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా దేశంలోని విద్యార్థి లోకం విజయం. ఈ విజయం వెనుకాల రాహుల్ గాంధీ శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ప్రధాని మోదీ తల వంచక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో పౌరుడి ఆకాంక్షలకు, వారి మాటలకు విలువ ఉండాలి. నియంత పోకడకు వెళ్లి మొండిగా వ్యవహరిస్తామంటే చెల్లదని ప్రధాన్ రాజీనామాతో స్పష్టమైంది. ఇకనైనా ప్రధాని మొండి వైఖరిని వీడి.. ప్రతిపక్షాల సూచనలను, సలహాలకు విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఢిల్లీలో పిల్లలపై బాష్పవాయు ప్రయోగం, వారిని విచక్షణారహితంగా కొట్టిన తీరును ఆయా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాలి. అంతేకాకుండా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సూచన మేరకు పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరాలి.. బాధిత పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!






