Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) హఠాన్మరణం చెందారు. హనుమకొండలోని (hanamkonda) తన నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటు (heart attack) రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) హఠాన్మరణం చెందారు. హనుమకొండలోని (Hanumakonda) తన నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు వరంగల్ బయల్దేరారు.
కాగా, 52 ఏండ్ల పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) నుంచి నర్సంపేట ఎమ్మెల్యేగా (Narsampet ML) విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు.
విద్యార్థి దశ నుంచే..
1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పెది సుదర్శన్ రెడ్డి జన్మించారు. 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్న ఆయన, వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరారు. రైతునాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్సీ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగారు. 2004 డిసెంబర్‌లో జిల్లా పార్టీ కన్వీనర్‌గా, 2005లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేండ్లు పనిచేశారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించారు.
- 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ దొంతి మాధవ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
- 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డిపై 16వేలకుపైగా ఓట్లతో విజయం సాధించారు.
- 2023లో ఎన్నికల్లో మరోసారిపోటీచేసి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పెండ్లి చేసుకున్న ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?






