త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gattu Ramchandar Rao | మీ హామీల‌ను కొరియ‌ర్ చేస్తున్నం.. స‌దువుకొని ఎందుకు ఎగ్గొట్టిర్రో చెప్పుండ్రి

Gattu Ramchandar Rao | కేటీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఓ కాంగ్రెస్ నేత సన్న బియ్యం పంపారని.. కేసీఆర్ హయాంలోనే స‌న్న బియ్యం మొదలైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు అన్నారు. సన్న బియ్యాన్ని కాంగ్రెస్ కనిపెట్టిందా? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 25, 2026, 4.41 pm IST

Gattu Ramchandar Rao | మీ హామీల‌ను కొరియ‌ర్ చేస్తున్నం.. స‌దువుకొని ఎందుకు ఎగ్గొట్టిర్రో చెప్పుండ్రి
Advertisement
  • కాంగ్రెస్ తీరు డిలీట్ లేకుంటే డినై అన్న‌ట్లుంది
  • స‌న్న బియ్యం డ్రామాలు బంజేసి హామీల సంగ‌తి చెప్పాలే
  • బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు డిమాండ్

Gattu Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఓ కాంగ్రెస్ నేత సన్న బియ్యం పంపారని.. కేసీఆర్ హయాంలోనే స‌న్న బియ్యం మొదలైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు అన్నారు. సన్న బియ్యాన్ని కాంగ్రెస్ కనిపెట్టిందా? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను, గ్యారంటీ కార్డులను, డిక్లరేషన్లను రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కకు కొరియర్‌లో పంపిస్తున్నామ‌న్నారు. వాటిని ఒకసారి చదువుకుని హామీలు ఎందుకు ఎగొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

నిన్న ఒకాయ‌న స‌న్న బియ్యం పంపిండు..

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఓ కాంగ్రెస్ నేత సన్న బియ్యం పంపిండు. సన్న బియ్యం కేసీఆర్ హయాంలోనే మొదలైందనే విషయం కాంగ్రెస్ నేతలు మరచిపోతున్నరు. సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ యాసంగి సీజన్‌లకు ఎగ్గొట్టిండ్రు. అనేక హామీలను గాలికొదిలిండ్రు. ఉచితంగా ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లకు ఆరు లక్షల ధరను నిర్ణయించిండ్రు. డిక్లరేషన్లకు మంగళం పాడిర్రు. జాబ్ కేలండర్‌ను జాబ్ లెస్ కేలండర్‌గా మార్చిండ్రు. హామీలపై అయితే డిలీట్ లేకపోతే డినై అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ తీరు. రాహుల్ గాంధీ అయితే దృతరాష్ట్రుడిగా మారిపోయిండు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంపై డ్రామాలు బంజేసి 420 హామీల అమలుపై వెంటనే స్పందించాలే అని గ‌ట్టు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు.

ఈ మీడియా స‌మావేశంలో గౌతమ్ ప్రసాద్, పల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement