PM Modi Convoy | రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
PM Modi Convoy | ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి కేవలం రెండంటే రెండే కార్ల కాన్వాయ్‌తో ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రధాని కాన్వాయ్‌లోని ఆ రెండు కార్ల గురించి ఇప్పుడు నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. అందులో ఒకటి రేంజ్ రోవర్ సెంటినల్ కాగా, మరొకటి టొయోటా ఫార్చూనర్. భద్రత పరంగా ఈ కార్లకు సాటిలేదనే చెప్పాలి. అందుకే కాన్వాయ్‌లో ఈ కార్లను ప్రధాని భాగం చేసుకున్నారు.
PM Modi Convoy | ఇంధన పొదుపు (Energy Crisis) చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ (PM Modi Convoy)లో భారీ మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. నిత్యం అత్యంత భద్రత నడుమ 20 కార్ల కాన్వాయ్‌తో వెళ్లే ప్రధాని.. తొలిసారిగా కేవలం రెండంటే రెండే కార్ల కాన్వాయ్‌తో ఢిల్లీలో ప్రయాణించారు. దీంతో ప్రధాని కాన్వాయ్‌లోని ఆ రెండు కార్ల గురించి ఇప్పుడు నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.
రేంజ్ రోవర్ సెంటినల్..
రెండు కార్లల్లో ఒకటి రేంజ్ రోవర్ సెంటినల్ (Range Rover Sentinel). ఈ కారు చాలా ప్రత్యేకమైనది. అత్యంత సురక్షితమైన కారు. టాటా మోటార్స్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ‘ల్యాండ్ రోవర్’ దీన్ని ప్రత్యేకంగా తయారు చేసింది. ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ విభాగం (SVO) తయారు చేసిన ప్రత్యేక ఆర్మర్డ్ SUV (Armoured) వాహనం ఇది. కారు బాడీని ఎలాంటి దాడుల నుంచైనా రక్షణ కల్పించేందుకు వీలుగా కఠినమైన పదార్థంతో, బలంగా రూపొందించారు.
ఈ కారుకు VR-8 స్థాయి బాలిస్టిక్ సర్టిఫికేషన్ కూడా ఉంది. 7.62mm ఆర్మోర్-పియర్సింగ్ బుల్లెట్లను, 15 కేజీల టీఎన్‌టీ పేలుళ్లను కూడా తట్టుకోగలదు. పైనుంచి లేదా కింద నుంచి గ్రేనేడ్ దాడులను తట్టుకునే రీతిలో ఈ కారును డిజైన్ చేశారు. డిఫెన్స్ కేపబిలిటీతో పాటు అగ్ని ప్రమాదం నివారించే టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. స్మోక్ లేదా గ్యాస్ అటాక్స్ నుంచి రక్షించేందుకు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది. సంక్షోభ సమయంలో కమ్యూనికేషన్ చేసుకునే రీతిలో ఈ కారు నిర్మాణం ఉంది. ఈ కారు ధర సుమారు రూ.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 10.4 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. మోదీ తరచుగా తన అధికారిక పర్యటనలు, ర్యాలీలు, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం ఈ కారునే ఉపయోగిస్తారు. సాధారణ రోజుల్లో ఈ కారు ప్రధాని కాన్వాయ్‌లో కూడా ఉంటుంది.
టొయోటా ఫార్చూనర్
మోదీ కాన్వాయ్‌లో ఉన్న మరో కారు టొయోటా ఫార్చూనర్ (Toyota Fortuner). జపాన్‌కు చెందిన ఈ ఎస్‌యూవీకి ఆటోమొబైల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందిన మోడళ్లలో ఒకటైన ఈ ఎస్‌యూవీ కూడా ప్రధాని కాన్వాయ్‌లో భాగంగా ఉంది. ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని .. ఈ కారును ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలతో మరింత పటిష్టం చేశారు. ఇండియన్ మార్కెట్లో రెండు ఇంజిన్ల ఆప్షన్‌తో దీన్ని విక్రయిస్తున్నారు.
పెట్రోల్ వెర్షన్ 2.7 లీటర్ల ఇంజిన్‌తో ఉంది. ఇది 166 హార్స్‌పవర్‌ను ఇస్తుంది. ఇది కేవలం ఆటోమోటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇక డీజిల్ వేరియంట్‌కు 2.8 లీటర్ల ఇంజిన్ ఉంటుంది. దీని కెపాసిటీ 204 హార్స్‌పవర్. ఇది మాన్యువల్ లేదా ఆటోమెటిక్ వర్షన్‌లో రెండింటిలోనూ అందుబాటులో ఉంది. అయితే, ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సదుపాయం మాత్రం కేవలం డీజిల్ వేరియంట్లలో మాత్రమే అభిస్తుంది.
Also Read..
రేపటి నుంచే సీపీగెట్ దరఖాస్తులు.. జూన్ 10 వరకు చాన్స్
ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో బస్సుకు మంటలు.. నలుగురు సజీవదహనం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi SRCC Speech | 13 ఏళ్ల తర్వాత అదే వేదిక.. మళ్లీ అదే ‘గ్లాస్’ కథ.. ఆ కాలేజీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం
సెప్టెంబర్ 6, 2026

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
సెప్టెంబర్ 5, 2026

PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



