CPGET 2026 | రేపటి నుంచే సీపీగెట్ దరఖాస్తులు.. జూన్ 10 వరకు చాన్స్
CPGET 2026 | రేపటి నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష సీపీగెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్ (JNTUH), కొత్తగూడెం ఎర్త్‌సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేపట్టనున్నారు.
- కేయూలో తొలిసారి సీపీగెట్
- మొత్తం 45 సబ్జెక్టులకు పరీక్షలు
CPGET 2026 | త్రినేత్ర.న్యూస్: రేపటి నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష సీపీగెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్ (JNTUH), కొత్తగూడెం ఎర్త్‌సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి (Balakista Reddy) , వర్సిటీల వైస్ ఛాన్సలర్లు, కన్వీనర్ తదితరులు తాజాగా విడుదల చేశారు.
కేయూలో తొలిసారి..
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలిసారి సీపీగెట్‌ను తమ వర్సిటీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సీపీగెట్ ద్వారా ఉండదన్నారు. వాటిని దోస్త్‌లో చేర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 45 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ ఆచార్య రాజేందర్ వివరించారు.
ఆలస్య రుసుం లేకుండా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేల ఆలస్య రుసుంతో 18 వరకు అవకాశం కల్పించారు. జూలై మొదటి వారంలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు తొలి వారంలో తరగతుల ప్రారంభం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
విదేశీ పర్యటనలకు రూ.10 కోట్లు..
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలతో 2025, ఏప్రిల్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. కానీ ఇంకా ఏ వర్సిటీ ఎన్ని ఖాళీలను భర్తీ చేసుకోవాలన్నది స్పష్టత ఇవ్వలేదన్నారు. తగినంత మంది ఆచార్యులు లేకపోవడం వల్ల పరిశోధన కొంత తగ్గిందని వివరించారు. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. నియామకాల్లో కొంత ఆలస్యమైన విషయం నిజమేనని, ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు. ఓయూ వీసీ కుమార్ ప్రసంగిస్తూ సీఎం పీహెచ్‌డీ ఫెలోషిప్‌ల పేరిట 200 మందికి నెలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆచార్యుల విదేశీ పర్యటనలకు రూ.10 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



