Bus Catches Fire | ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో బస్సుకు మంటలు.. నలుగురు సజీవదహనం
Bus Catches Fire | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్ (Surendranagar) జిల్లాలో ఓ ట్యాంకర్‌ను (tanker) స్లీపర్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సుకు మంటలు అంటుకుని (Bus Catches Fire) నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
Bus Catches Fire | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్ (Surendranagar) జిల్లాలో ఓ ట్యాంకర్‌ను (tanker) స్లీపర్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సుకు మంటలు అంటుకుని (Bus Catches Fire) నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సంగాని గ్రామ సమీపంలోని చోటిలా-రాజ్‌కోట్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.ఎస్. భడోరియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఈ లగ్జరీ బస్సు 40 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు వెళ్తోంది. అదే మార్గం గుండా వెళ్తున్న ఓ ట్యాంకర్ వాహనం టైరు పేలడంతో అదుపుతప్పింది. దీంతో దాని వెనుకే వస్తున్న బస్సు ట్యాంకర్‌ను బలంగా ఢీకట్టింది. ఆ తర్వాత మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు అంటుకున్నాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. తప్పించుకునే క్రమంలో నలుగురు ప్రయాణికులు మంటల్లో సజీవదహనమయ్యారు. సుమారు 10 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ వాహనంలో ఏముందనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
Also Read..
ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రోలో ప్రయాణించండి.. ఢిల్లీ ప్రభుత్వం పొదుపుబాట
సంబంధిత వార్తలు

Live-In Partner | 40 ఏండ్ల మహిళతో 20 యువకుడి సహజీవనం.. నడిరోడ్డుపై కట్టేసి కొట్టిన పోలీసులు
సెప్టెంబర్ 6, 2026

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
సెప్టెంబర్ 4, 2026

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



