PM Modi | నా అందమైన చెల్లెలు.. జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
PM Modi | భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకైచి (Sanae Takaichi)కి ప్రధాని మోదీ (PM Modi) సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను తన అందమైన చెల్లెలుగా అభివర్ణించారు.
PM Modi | భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం (India-Japan Annual Summit) కోసం భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని (Japan PM) సనాయె తకాయిచికి ప్రధాని మోదీ (PM Modi) సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను తన సోదరిగా అభివర్ణించారు. "భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు విచ్చేసిన నా అందమైన చెల్లెలు, జపాన్ ప్రధాని సనాయె తకైచికి స్వాగతం పలుకుతున్నా" అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ పిలిచిన ఆత్మీయ పిలుపుకు జపాన్ ప్రధాని పులకరించిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
అంతకుముందు తకైచితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య అంశాలకు సంబంధించి 120 వరకు ఒప్పందాలు కుదిరాయి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటి సారిగా ఒక ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో పాటు ఆర్థిక భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భాగస్వామ్యం కోసం ఇరు దేశాలు ఒక ఉమ్మడి విజన్‌ను ఆవిష్కరించాయని చెప్పారు. అంతేకాదు, రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మోదీ తెలిపారు.
#WATCH | Delhi: During press statement with Japanese PM Sanae Takaichi, Prime Minister Narendra Modi says, "Excellency and my younger sister, Prime Minister Takaichi, delegates from both nations, and members of the media—Namaskar. It gives me great pleasure to welcome Prime… pic.twitter.com/O78kLVnptK
— ANI (@ANI) July 2, 2026
Also Read..
సినిమా తరహాలో ప్రమాదకర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ మలయాళం సూపర్ హిట్ మూవీ - లోన్ యాప్ వేధింపుల కథతో
ఓప్పో రెనో16 సిరీస్ వచ్చేసింది.. 3డీ డిజైన్, భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఫోన్లు..
సంబంధిత వార్తలు

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026

PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం
సెప్టెంబర్ 1, 2026

PM Modi | విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
- ●OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన
- ●Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్
- ●Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు
- ●Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..

OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన

Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్

Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు



