త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Empire State Building | సినిమా త‌ర‌హాలో ప్ర‌మాద‌క‌ర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ట‌వ‌ర్ ఎక్కి ఎంగేజ్మెంట్‌

Empire State Building | ఓ జంట న్యూయార్క్ (New York) న‌గ‌రంలోని అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (Empire State Building) ట‌వ‌ర్‌పై ఎంగేజ్మెంట్ చేసుకుని క‌ట‌క‌టాల‌పాలైంది. సినిమా త‌ర‌హాలో వారు ప్ర‌ద‌ర్శించిన ప్ర‌మాద‌క‌ర స్టంట్స్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

D

International | Published On Jul 2, 2026, 3.10 pm IST

Empire State Building | సినిమా త‌ర‌హాలో ప్ర‌మాద‌క‌ర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ట‌వ‌ర్ ఎక్కి ఎంగేజ్మెంట్‌
Advertisement

Empire State Building | ప్ర‌స్తుతం యువ‌త త‌మ ప్రేమ జ్ఞాప‌కాల‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ చేసేందుకు కూడా వెనుకాడ‌ట్లేదు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలో ఓ జంట అత్యంత ఎత్తైన భ‌వ‌నంపై ఎంగేజ్మెంట్ చేసుకుని క‌ట‌క‌టాల‌పాలైంది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. న‌లుపు రంగు దుస్తులు ధ‌రించిన ఓ జంట న్యూయార్క్ (New York) న‌గ‌రంలోని అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (Empire State Building) ట‌వ‌ర్ ఎక్కింది. అక్క‌డ ఎంగేజ్మెంట్ చేసుకుంది. అనంత‌రం ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి విల‌సిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించింది. సినిమా త‌ర‌హాలో వారు ప్ర‌ద‌ర్శించిన ప్ర‌మాద‌క‌ర స్టంట్స్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియోలో ప్ర‌మాదం అంచున ఆ జంట ఉండ‌టం అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఏమాత్రం ప‌ట్టుత‌ప్పినా పైప్రాణాలు పైకేపోయేవి. స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. ఆ జంట కింద‌కు దిగ‌గానే అదుపులోకి తీసుకున్నారు. ఆ జంట‌ను న్యూజెర్సీకి చెందిన ఇవాన్‌, ఏంజెలాగా గుర్తించారు. వీరు గతంలోనూ ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక వైర‌ల్ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Also Read..

మణిపూర్‌లో మళ్లీ హింస.. 20కి పైగా ఇళ్లకు నిప్పు

హాలీవుడ్ రొమాంటిక్ మూవీ రీమేక్‌లో జాన్వీక‌పూర్ - అబ్బాయి ఆత్మ అంద‌మైన అమ్మాయిలోకి ప్ర‌వేశిస్తే!

చ‌ర్చించే ద‌మ్ము లేక సీఎం, మంత్రులు పారిపోతున్నారు : కేటీఆర్

Advertisement
Advertisement