Malayalam OTT | ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ మలయాళం సూపర్ హిట్ మూవీ – లోన్ యాప్ వేధింపుల కథతో
మలయాళం సూపర్ హిట్ మూవీ బాల్తీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. జూలై 10 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయి ప్రీతి అస్రానీ కథానాయికగా కనిపించింది.
Entertainment | Published On Jul 2, 2026, 3.38 pm IST
Malayalam OTT | మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ బాల్తీ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో షేన్ నిగమ్, శంతను భాగ్యరాజ్ హీరోలుగా నటించారు. అచ్చ తెలుగు అమ్మాయి ప్రీతి అస్రానీ కథానాయికగా కనిపించింది. ఉన్ని శివలింగమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్టుగా నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో బాల్తీ థియేటర్లలో రిలీజైంది.
పది నెలల తర్వాత...
దాదాపు పది నెలల తర్వాత ఎట్టకేలకు ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. జూలై 10న సోనీలివ్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మలయాళం, తమిళంతో పాటు తెలుగు వెర్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.
అల్లు అర్జున్ రాకా ఫేమ్...
బాల్తీ సినిమాకు అల్లు అర్జున్ రాకా ఫేమ్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ కెరీర్ మొదలైంది. తొలి సినిమాకే రెండు కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవడం మలయాళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ బాల్తీ సినిమాతో దాదాపు పదహారేళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మలయాళం సినిమాలో డైరెక్టర్లు సెల్వ రాఘవన్, ఆల్ఫోన్స్ పుత్రేన్ కీలక పాత్రల్లో కనిపించారు.
లోన్ యాప్ వేధింపులు...
బాల్తీ, డాష్‌తో పాటు మరికొందరు స్నేహితులు కలిసి పంచమి రైడర్స్ పేరుతో కబడ్డీ టీమ్‌ను ఏర్పాటుచేస్తారు. భైరవన్ అనే రౌడీ గ్రూప్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్తీ, డాష్ గెలుస్తారు. వారి ధైర్యానికి మెచ్చిన భైరవన్...బాల్తీతో పాటు అతడి స్నేహితులకు ఓ కార్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అంతే కాకుండా తన లోన్ యాప్ కంపెనీలోనే వారికి జాబ్ ఇస్తాడు. భైరవన్ లోన్ యాప్ వేధింపుల వల్ల ఓ యువకుడు కాలు కోల్పోతాడు. ఆ నేరం బాల్తీ, డాష్‌పై పడుతుంది. ఈ క్రైమ్ వల్ల తాను ప్రేమించిన కావేరికి బాల్తీ దూరమవ్వాల్సివస్తుంది. భైరవన్ అక్రమ బిజినెస్ నుంచి బాల్తీ, డాష్ ఎలా బయటపడ్డారు అన్నదే ఈ సినిమా కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ – బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
సెప్టెంబర్ 1, 2026

Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు
ఆగస్టు 27, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్
- ●Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
- ●OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన
- ●Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్
- ●Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు
- ●Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : కలెక్టర్ గరిమ అగ్రవాల్

BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్

Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..

OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన

Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్



