OPPO Reno16 | ఓప్పో రెనో16 సిరీస్ వచ్చేసింది.. 3డీ డిజైన్, భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఫోన్లు..
OPPO Reno16 | మొబైల్స్ తయారీదారు ఓప్పో తన నూతన స్మార్ట్ ఫోన్లు రెనో 16, రెనో16సిలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో క్రియేటివ్ స్టూడియో, ప్రొడక్టివిటీ టూల్స్, అధునాతన ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఒకే పరికరంలో అందిస్తోంది.
Technology | Published On Jul 2, 2026, 3.34 pm IST
OPPO Reno16 | మొబైల్స్ తయారీదారు ఓప్పో తన నూతన స్మార్ట్ ఫోన్లు రెనో 16, రెనో16సిలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో క్రియేటివ్ స్టూడియో, ప్రొడక్టివిటీ టూల్స్, అధునాతన ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఒకే పరికరంలో అందిస్తోంది. కంపెనీ తొలిసారిగా పరిశ్రమలోనే హోలోవర్స్ 3డీ డిజైన్, మెరుగైన ఏఐ పోర్ట్రెయిట్ కెమెరా సిస్టమ్, తాజా కలర్ ఓఎస్ 16 ఇంటర్‌ఫేస్‌ను ఈ ఫోన్లలో తీసుకొచ్చింది. రెనో16 సిరీస్‌లో ఓప్పో సొంతంగా అభివృద్ధి చేసిన హోలోవర్స్ 3డీ టెక్నాలజీని ఉపయోగించింది. స్టారీ వైట్ కలర్ వేరియంట్‌లో ప్రత్యేకంగా అందించిన 3డీ పాప్ ప్లానెట్ డిజైన్ డ్యూయల్ లేయర్ ఆప్టికల్ స్ట్రక్చర్, లక్షలాది మైక్రోలెన్స్‌ల సహాయంతో కళ్లజోడు అవసరం లేకుండానే 3డీ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. గ్లాస్ కింద ఉన్న ఎలిమెంట్లు తేలుతున్నట్లుగా కనిపించే ప్రత్యేక అనుభూతిని ఇది అందిస్తుంది.
3డీ గ్లిట్టర్ ఫినిష్, పవర్‌ఫుల్ కెమెరాలు..
ఫోన్లకు ఫ్లోటింగ్ 3డీ గ్లిట్టర్ ఫినిష్, కెమెరా మాడ్యూల్ చుట్టూ డైనమిక్ స్టెల్లర్ రింగ్ డిజైన్‌ను ఇచ్చారు. రెండు మోడళ్లు కూడా స్టారీ వైట్, ట్విలైట్ వైలెట్, స్టెల్లర్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఓప్పో రెనో16లో 6.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, రెనో16సీలో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. రెండు ఫోన్లూ 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. రెండు మోడళ్లలోనూ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం బాడీని ఉపయోగించారు. ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో కొత్తగా ఏఐ స్నాప్ కీ అనే ఫిజికల్ బటన్‌ను అందించారు. దీని ద్వారా వాయిస్ రికార్డర్, ట్రాన్స్‌లేటర్, కెమెరా లేదా మైండ్ స్పేస్ వంటి టూల్స్‌ను ఒక్క క్లిక్‌తో ఓపెన్ చేయవచ్చు. రెనో16లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెనో16సీలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ 3.5ఎక్స్ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా ఉంది.
ప్రత్యేకంగా ఓప్పో బబుల్..
రెనో16లో అల్ట్రా వైడ్, ప్రధాన, టెలిఫోటో లెన్స్‌లతో 4కే 60ఎఫ్‌పీఎస్ హెచ్‌డీఆర్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. 4కే ఆటో స్ట్రైటెన్ ఫీచర్ చేతి కదలికలను రియల్ టైమ్‌లో సరిచేస్తుంది. జూమ్ ఫ్రీ వీడియో ద్వారా సాఫీగా జూమ్ ట్రాన్సిషన్‌లు పొందవచ్చు. కొత్త నేచురల్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ చర్మ రంగులు, పరిసర లైటింగ్‌ను సహజంగా చూపిస్తుంది. సాధారణ బ్యూటీ ఫిల్టర్ల మాదిరిగా ఒకే రకమైన ప్రాసెసింగ్ చేయదు. అలాగే ఏఐ రీమిక్స్ కొలాజ్, పాప్ క్యామ్, పాప్‌ఔట్ 2.0, డ్యూయల్ వ్యూ వీడియో 2.0, ఏఐ రీకంపోజ్, ఏఐ పర్‌ఫెక్ట్ షాట్, ఏఐ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ స్టూడియో వంటి అనేక క్రియేటివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఓప్పో బబుల్ అనే కొత్త మాగ్నెటిక్ స్మార్ట్ కెమెరా యాక్సెసరీని కూడా కంపెనీ లాంచ్ చేసింది. కేవలం 27.5 గ్రాముల బరువున్న ఈ పరికరంలో 1.73 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఫోన్ వెనుక కెమెరా ప్రివ్యూను చూపిస్తూ మెయిన్ కెమెరాతోనే హై రిజల్యూషన్ సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఐపీ54 రేటింగ్, 550ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్‌గా కూడా పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ..
ఓప్పో రెనో16లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. గత తరం కంటే సీపీయూ పనితీరు 27 శాతం, జీపీయూ పనితీరు 30 శాతం వరకు మెరుగుపడిందని కంపెనీ తెలిపింది. రెనో16సీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉంది. 12జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 12జీబీ వర్చువల్ ర్యామ్‌ను కలిపి మొత్తం 24జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు. రెండు ఫోన్లలోనూ ఏఐ లింక్‌బూస్ట్ 4.0, ఏఐ హైపర్‌బూస్ట్ 2.0 ఫీచర్లు ఉండటంతో మెరుగైన నెట్‌వర్క్ పనితీరు, 120ఎఫ్‌పీఎస్ వరకు స్థిరమైన గేమింగ్ అనుభవం లభిస్తుంది. ఓప్పో రెనో16లో 6700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెనో16సీలో 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. రెండు ఫోన్లూ 80వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తాయి. ఈ సిరీస్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 అందించారు. ఇందులో ఏఐ మైండ్ పైలట్ ద్వారా గూగుల్ జెమినీ, పర్‌ప్లెక్సిటీ, చాట్‌జీపీటీలను ఒకే స్క్రీన్‌పై ఉపయోగించి ఫలితాలను సరిపోల్చుకోవచ్చు.
ధర వివరాలు..
ఏఐ మైండ్ స్పేస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. ఏఐ బిల్ మేనేజర్ రసీదులు, స్క్రీన్‌షాట్‌ల నుంచి ఖర్చులను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఏఐ మెనూ ట్రాన్స్‌లేషన్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌లేషన్, ఏఐ లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి భాషా అనువాద ఫీచర్లు ఉన్నాయి. ఏఐ రికార్డింగ్ స్టికర్, ఏఐ స్కాన్ అండ్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి డాక్యుమెంట్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓప్పో రెనో16 ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.61,999 ఉండగా, 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.67,999గా ఉంది. ఓప్పో రెనో16సీ 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.46,999 ఉండగా, 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. అలాగే 12జీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.55,999గా నిర్ణయించారు. ఓప్పో బబుల్ ధర రూ.7,999గా ఉంది.
బ్యాంకు ఆఫర్లు సైతం..
రెనో16 సిరీస్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. జూలై 9 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓప్పో ఈ-స్టోర్, ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, యూపీఐ చెల్లింపులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్, రూ.5వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, 180 రోజుల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ప్రతి రెనో16 కొనుగోలుపై ఓప్పో ఎంకో బడ్స్3 ప్రో ప్లస్ పై 50 శాతం తగ్గింపు, అలాగే ఓప్పో బబుల్‌తో బండిల్ కొనుగోలుపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ లేదా జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు అందిస్తున్నారు.
తాజావార్తలు
- ●Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు
- ●Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
- ●HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్..
- ●Amarnath | మంచు బిందువులే శివలింగంగా..! అమర్నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
- ●Harish Rao | రూ. లక్ష కోట్లు తగ్గింది కదా..? మరి రాజీనామా చేయ్ జూపల్లి : హరీశ్‌రావు
- ●Capgemini Daycare Incident | బెంగళూరు డేకేర్‌లో పసివాళ్లపై పైశాచికత్వం: వాషింగ్ మెషీన్లో వేసి, టాయిలెట్ జెట్లతో.. గుట్టు విప్పిన వీడియోలు

Harish Rao | చర్చకు సిద్ధమైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు..? : హరీశ్‌రావు

Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ

HUAWEI Band 11 Series | రూ.3,999కే హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్లు.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Amarnath | మంచు బిందువులే శివలింగంగా..! అమర్నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!



