EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు
EPFO wage | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితిని (EPFO wage) రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచింది. ఈ నిర్ణయం విశ్వ కర్మ జయంతి సందర్భంగా రేపటి నుంచే అమల్లోకి రానుంది.
EPFO wage | త్రినేత్ర.న్యూస్ : ఉద్యోగులకు (Employees) కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు. విశ్వ కర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. వీరంతా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న వార్షిక బడ్జెట్ మద్దతు సుమారు రూ. 10,250 కోట్లుగా ఉండగా.. తాజా వేతన పరిమితి పెంపుతో ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.11,339 కోట్ల మేర అదనపు భారం పడనుందని వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 56,696 కోట్లుగా ఉండనుంది.
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితి పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. జీవన వ్యయం పెరిగినప్పటికీ దాదాపు 12 ఏళ్లుగా గరిష్ఠ వేతన పరిమితి పెరగలేదు. 2014 సెప్టెంబరులో చివరిసారిగా రూ.6500 నుంచి రూ.15వేలకు పెంచారు. దీంతో వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారిక డేటా ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ పరిధిలో సుమారు 7.98 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. అలాగే ఈపీఎస్ (EPS) ద్వారా సుమారు 82 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు.
▪️#Cabinet approves enhancement of EPFO wage ceiling from Rs.15,000 to Rs.25,000 per month.
▪️The decision is expected to bring more than 51 lakh additional employees within the ambit of mandatory EPFO coverage.
▪️The annual Government outgo is estimated at about Rs.11,339… pic.twitter.com/Tx7jR0O2n7
— PIB India (@PIB_India) September 16, 2026
Also Read..
ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
నోటాకు ప్రధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
సంబంధిత వార్తలు

PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
సెప్టెంబర్ 16, 2026

BRICS Summit 2026 | భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే
సెప్టెంబర్ 12, 2026

SIP Vs EPF | ఎస్ఐపీ వర్సెస్ ఈపీఎఫ్.. రెండింటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది..?
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు
- ●Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
- ●Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..



