త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మేం పోలేదు.. ప‌థ‌కం ప్ర‌కారం స‌స్పెండ్ చేసిన‌వ్

Harish Rao | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్త‌ది.. స‌మాధానం చెప్పే ధైర్యం లేద‌నే త‌మ‌ను ప‌థ‌కం ప్ర‌కారం స‌స్పెండ్ చేసిన‌వ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. అబ‌ద్దాలు, అర్ధ స‌త్యాలు మాట్లాడి డైవ‌ర్స‌న్ పాలిటిక్స్ తెర‌లేపారు. ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు అని సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 16, 2026, 7.11 pm IST

Harish Rao | మేం పోలేదు.. ప‌థ‌కం ప్ర‌కారం స‌స్పెండ్ చేసిన‌వ్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్త‌ది.. స‌మాధానం చెప్పే ధైర్యం లేద‌నే త‌మ‌ను ప‌థ‌కం ప్ర‌కారం స‌స్పెండ్ చేసిన‌వ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. అబ‌ద్దాలు, అర్ధ స‌త్యాలు మాట్లాడి డైవ‌ర్స‌న్ పాలిటిక్స్ తెర‌లేపారు. ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు అని సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ టీష‌ర్ట్ వేసుకుని, స్టిక్క‌ర్లు వేసుకుని పార్ల‌మెంట్‌కు వెళ్లారు. అసెంబ్లీ, పార్ల‌మెంట్ నిబంధ‌న‌లు వేరు.. రాహుల్ గాంధీ చేసింది ఒప్పు, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ ష‌ర్ట్ వేసుకుని వ‌స్తే త‌ప్పు అని సీఎం అంటున్న‌రు. కొన్ని రూల్స్ ఉంటాయి. రాజ్యాంగం ఉంటుంది. సంప్ర‌దాయం ఉంటుంది అని సీఎం అన్నారు. పార్ల‌మెంట్ పాటించిన నిబంధ‌న‌లే అసెంబ్లీ పాటిస్తుంది. బీఆర్ఎస్ నేత‌లు ఏద‌న్నా బూతు ప‌దం, నిషేధిత ప‌దాలు రాసుకుని అసెంబ్లీకి వ‌చ్చామా..? ఆరు గ్యారెంటీల్లో విఫ‌లం, పెన్ష‌న్లు ఎగ్గొట్టింది నిజం అని రాస్తే నిషేధిత ప‌దం, బూతు ప‌దం అని అడ్డం పెట్టుకుని స‌భ నుంచి సస్పెండ్ చేశారు.. మేం పోలేదు.. ప‌థ‌కం ప్ర‌కారం అసెంబ్లీ నుంచి పంపించిన‌వ్ అని మండిప‌డ్డారు.

క‌నీసం మైక్ ఇవ్వండి అని కోరినం

స‌బితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు.. సునీతా ల‌క్ష్మారెడ్డి చీర లాగారు.. దాని మీద ఎంక్వైరీ చేసి క్ష‌మాప‌ణ చెప్పండి. క‌నీసం మైక్ ఇవ్వండి అని కోరినం. మ‌హిళా ఎమ్మెల్యేల మీద హ‌త్యాయ‌త్నం జ‌రిగితే మైక్ ఇవ్వ‌లేదు. మేం స‌భ‌లో ఉంటే భండారం, కుంభ‌కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని మ‌మ్మ‌ల్ని స‌భ నుంచి స‌స్పెండ్ చేసింది నువ్వు. ఒక్క రోజు చేయొచ్చు క‌దా.. కానీ సెష‌న్ మొత్తం స‌స్పెండ్ చేశావు. ఆ రోజు మేం ప‌ట్టుబ‌ట్ట‌లేదు.. ఒక్క‌సారికే స‌స్పెండ్ చేశావు. వాయిదా వేసి రెండోసారి ప్ర‌య‌త్నం చేస్తారు. స్పీక‌ర్ చాంబ‌ర్‌కు పిలిచి మాట్లాడుతారు. మైక్ ఇచ్చి మాట్లాడానికి అవ‌కాశం ఇచ్చినా విన‌క‌పోతే స‌స్పెండ్ చేస్తారు. మీరు కుట్ర‌పూరితంగా స‌స్పెండ్ చేశారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌ను ఫేస్ చేసే ద‌మ్ము, ధైర్యం లేక

స‌స్పెన్ష‌న్ ఎత్తేయండి.. స‌భ‌కు వ‌స్తామ‌ని మా ఎమ్మెల్యే కేపీ వివేకానంద‌, కృష్ణారావు చెప్పారు. నీ అవినీతిపై ఆధారాల‌తో స‌హా రుజువు చేస్తామ‌ని బ‌హిరంగ స‌వాల్ చేశారు.. స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌మ‌ని సీపీఐ, బీజేపీ కూడా అడిగింది. నీకు బీఆర్ఎస్‌ను ఫేస్ చేసే ద‌మ్ము, ధైర్యం లేక కుట్ర‌తో స‌స్పెండ్ చేసిన‌వ్. ఈ మూడేండ్ల‌లో మాపై ఎదురుదాడులు, ఎంక్వైరీలు వేసిన‌వ్. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ లేకుండా.. ప్ర‌తిప‌క్షం అడిగే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్ప‌కుండా ఎదురుదాడి చేసి త‌ప్పించుకోవాల‌ని డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని సీఎంపై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement