Samsung Galaxy Z Fold 8 | శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. ఫీచర్లు అద్భుతం..
Samsung Galaxy Z Fold 8 | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జడ్ ఫోల్డ్8, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రాలను లాంచ్ చేసింది. ఏడేళ్లుగా ఫోల్డబుల్ డిజైన్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చిన సంస్థ, ఈసారి వినియోగదారులకు మరిన్ని ఆప్షన్‌లను అందించేలా కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Jul 23, 2026, 10.49 am IST
Samsung Galaxy Z Fold 8 | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జడ్ ఫోల్డ్8, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రాలను లాంచ్ చేసింది. ఏడేళ్లుగా ఫోల్డబుల్ డిజైన్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చిన సంస్థ, ఈసారి వినియోగదారులకు మరిన్ని ఆప్షన్‌లను అందించేలా కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది. ఉత్పాదకత, మీడియా వినియోగం, సులభమైన పోర్టబిలిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్లలో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను సమగ్రంగా అప్‌డేట్ చేసింది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8లో కొత్త యాస్పెక్ట్ రేషియోలను ప్రవేశపెట్టి వీడియోలు, గేమింగ్, ఈ-బుక్స్ చదవడం, సోషల్ మీడియా వినియోగానికి అనుకూలంగా రూపొందించారు. కేవలం 201 గ్రాముల బరువుతో ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యంత తేలికైన గెలాక్సీ జడ్ ఫోల్డ్ మోడల్‌గా నిలిచింది.
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8..
ఈ ఫోన్‌లో 10:16 కవర్ డిస్‌ప్లే ఉండగా మెసేజింగ్, బ్రౌజింగ్, సోషల్ మీడియా వంటి రోజువారీ పనులకు అనువుగా ఉంటుంది. లోపల 4:3 యాస్పెక్ట్ రేషియోతో 7.6 ఇంచుల మెయిన్ డిస్‌ప్లేను అందించారు. వీడియోలు, గేమింగ్‌కు ఇది మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌ను తిప్పితే ఈ-బుక్స్, పెద్ద వ్యాసాలు చదవడానికి అనువైన ఫార్మాట్‌గా మారుతుంది. ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీ ద్వారా టైటానియం అలాయ్ ఫిల్మ్, మెరుగైన టైటానియం ప్లేట్‌ను ఉపయోగించి ఫోన్ దృఢత్వాన్ని పెంచడంతోపాటు ఫోల్డ్ క్రీజ్‌ను తగ్గించేలా రూపొందించారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీలను అందించారు. డిస్‌ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందించడంతోపాటు లో రిఫ్లెక్షన్ కోటింగ్ వల్ల సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

గెలాక్సీ జడ్ ఫోల్డ్8లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. డ్యుయల్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియోలను రికార్డ్ చేయవచ్చు. మై ఫ్యాన్‌క్యామ్ ఫీచర్ ఎంపిక చేసిన వ్యక్తిని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసి వీడియోను వివిధ యాస్పెక్ట్ రేషియోల్లో రూపొందిస్తుంది. ఈ ఫోన్‌లో 7.6 ఇంచుల క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్‌ప్లే, 5.5 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ డిస్‌ప్లే, 1 నుంచి 120 హెడ్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 ప్లస్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో పనిచేస్తుంది. ఐపీ48 వాటర్ రెసిస్టెన్స్, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, 45 వాట్ల వైర్డ్, 20 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంది.
గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా..
శాంసంగ్ తొలిసారిగా ఫోల్డబుల్ విభాగంలో అల్ట్రా మోడల్‌ను తీసుకొచ్చింది. ఫోన్ ను తెరిచినప్పుడు మందం కేవలం 4.1 మిల్లీమీటర్లు ఉంటుంది. దీని బరువు 215 గ్రాములు మాత్రమే. ఇందులో 8 ఇంచుల పెద్ద మెయిన్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో కూడా అదే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అయితే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, విస్తృతమైన గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ను ఇచ్చారు. ఇందులో 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను అందించారు. పూర్తి 200 మెగాపిక్సల్ మోడ్‌లో హెచ్‌డీఆర్ ప్రాసెసింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాతో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 30ఎక్స్ స్పేస్ జూమ్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ వెలుతురులో మెరుగైన నైట్ ఫొటోగ్రఫీ, 8కె వీడియో రికార్డింగ్, రియల్ టైమ్ సినీ లట్ కలర్ గ్రేడింగ్ వంటి ఫీచర్లను కూడా అందించారు.

ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 తో పనిచేస్తాయి. ఇందులో ఫోల్డబుల్ ఫార్మాట్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏఐ ఫీచర్లను అందించారు. నౌ నడ్జ్ ఫీచర్ స్క్రీన్‌పై జరుగుతున్న సంభాషణలను విశ్లేషించి క్యాలెండర్, ప్రదేశాలు వంటి సూచనలను వెంటనే చూపిస్తుంది. జెమిని నోట్‌బుక్ లో నోట్స్, ఫైళ్లు, ఆడియోలు, చిత్రాలను డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఒకేచోట నిర్వహించవచ్చు. ఇది మీటింగ్ సారాంశాలు, ఆడియో ఓవర్‌వ్యూలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ను ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది. గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, గెలాక్సీ వాచ్9, త్వరలో వచ్చే స్మార్ట్ గ్లాసెస్‌తో కూడా ఈ ఫోన్లు సమన్వయంగా పనిచేస్తాయి.
గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రాలో 8 ఇంచుల క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే, 6.5 ఇంచుల కవర్ డిస్‌ప్లే, 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్, 200ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలిఫొటో కెమెరా, ఐపీ48 వాటర్ రెసిస్టెన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 20 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై 7, బ్లూటూత్ 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర వివరాలు..
గెలాక్సీ జడ్ ఫోల్డ్8కు చెందిన 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.1,79,999 ఉండగా, 12జీబీ, 512జీబీ మోడల్ ధర రూ.1,99,999గా ఉంది. 16జీబీ, 1టీబీ మోడల్ ధరను రూ.2,39,999గా నిర్ణయించారు. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.1,99,999 ఉండగా, 12జీబీ, 512జీబీ ధరను రూ.2,19,999గా నిర్ణయించారు. 16జీబీ, 1టీబీ ధర రూ.2,59,999గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్8, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా మోడళ్లకు భారత్‌తోపాటు ఎంపిక చేసిన మార్కెట్లలో గురువారం నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 8 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లు గ్రాఫైట్, క్రీమ్ రంగుల్లో లాంచ్ అయ్యాయి. గెలాక్సీ జడ్ ఫోల్డ్8 అల్ట్రా ప్రత్యేకంగా వయొలెట్ షాడో, గెలాక్సీ జడ్ ఫోల్డ్8 లావెండర్ రంగులో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లో ఫోల్డ్8 అల్ట్రాను ప్రత్యేకంగా గ్రీన్ షాడో, ఫోల్డ్8ను పిస్తాచియో రంగుల్లో అందిస్తున్నారు.
శాంసంగ్ ప్రారంభ ఆఫర్లలో భాగంగా రూ.10వేల అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ.9వేల బ్యాంక్, యూపీఐ బెనిఫిట్ లను అందిస్తోంది. అలాగే 30 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ లేదా 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐతో జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
తాజావార్తలు
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..
- ●Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..




