PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
PM Modi | దశాబ్దాలుగా సాగుతున్న ఓ భూ వివాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్కూల్‌మేట్ 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా (Asgar Ali Vora)కు భారీ ఊరట దక్కింది.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : దశాబ్దాలుగా సాగుతున్న ఓ భూ వివాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్కూల్‌మేట్ 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా (Asgar Ali Vora)కు భారీ ఊరట దక్కింది. మహారాష్ట్ర (Maharashtra)లోని మీరా భయందర్ (Mira-Bhayandar) ప్రాంతంలో ఉన్న భూమిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) నరేంద్ర మెహతాతో అస్గర్‌కు మధ్య 11 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ వారం రోజుల క్రితమే అస్గర్.. ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సమస్య నుంచి అస్గర్‌కు విముక్తి లభించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 1989లో రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా భయందర్ ఈస్ట్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేసినట్లు అస్గర్ తెలిపారు. ఆ భూమిని తాను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. 2011లో నకిలీ పత్రాలు సృష్టించి తన ప్రమేయం లేకుండానే ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అందులో ఒక భాగం స్వయం బిల్డర్స్ ఆధీనంలో ఉండగా.. మరో భాగం ఎమ్మెల్యే మెహతాకు చెందిన సెవెన్ ఎవెన్ కన్‌స్ట్రక్షన్స్ ఆధీనంలో ఉందని వివరించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని అస్గర్ వాపోయారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భయందర్ ఈస్ట్‌లోని తన భూమిని ఎమ్మెల్యే మెహతాకు చెందిన బిల్డర్లు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. భూ వివాదంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సంతకాల ఫోర్జరీపై, ఇందులో ప్రమేయం ఉన్న బిల్డర్లు, ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ పత్రాల సృష్టిపై 2015లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదిక దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇటీవలే వచ్చిందని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇంతటి జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫ్రెండ్ ఆవేదనకు చలించిపోయిన ప్రధాని మోదీ భూ వివాదాన్ని పరిష్కరించారు. ఈ భూమి విషయంలో రెండు సంస్థలూ వెనక్కి తగ్గాయి. అంతేకాదు, వివాదాస్పద స్థలాన్ని వదులుకుంటున్నట్లు ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు. ఇరువర్గాల మధ్య కుదిరిన రాజీ ఒప్పందం మేరకు అస్గర్‌పై తాను పెట్టిన పోలీసు ఫిర్యాదును కూడా మెహతా ఉపసంహరించుకున్నారు.
Also Read..
బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?
- ●Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
- ●Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
- ●UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..
- ●Singapore | సెమీ కండక్టర్ల పరిశ్రమకు సింగపూర్ సిద్ధం

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్

Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన






