త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Assembly | రాష్ట్రంలో సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల వివాదాలకు 30 రోజుల్లో పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ వివాదాల పరిష్కారానికి సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఉన్నతాధికారితో హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో వెల్లడించారు.

P

Telangana | Published On Sep 16, 2026, 7.45 pm IST

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

TG Assembly | రాష్ట్రంలో సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల వివాదాలకు 30 రోజుల్లో పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ వివాదాల పరిష్కారానికి సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఉన్నతాధికారితో హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో వెల్లడించారు. 22ఏ నిషేధిత జాబితాపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములకు సంబంధించిన చట్టాలు, వాటి పరిణామ క్రమాన్ని సభకు వివరించారు. చట్టబద్ధమైన, న్యాయమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

యూఎల్‌సీ భూములకు కొత్త విధానం

అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) మిగులు భూముల క్రమబద్ధీకరణకు కొత్త విధానం తీసుకురానున్నారు. పాత పెండింగ్‌ దరఖాస్తులతోపాటు కొత్త దరఖాస్తులకూ ఈ విధానం వర్తించనుంది. రిజిస్ట్రేషన్‌, క్రమబద్ధీకరణ ప్రక్రియలను ఏకకాలంలో చేపట్టనున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ పరిధిలోని ఆమోదిత లేఅవుట్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి వారం రోజుల్లో సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి కోల్‌బెల్ట్‌ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జీవో 59 కింద కన్వెయన్స్‌ డీడ్స్‌ జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను అర్హతల ఆధారంగా తుది పరిశీలన చేసి పరిష్కరించేందుకు మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మరో 18,590 పెండింగ్‌ దరఖాస్తులను కొత్త క్రమబద్ధీకరణ విధానంలో పరిష్కరిస్తారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు

జీవో 118 కింద పెండింగ్‌ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించి, పరిష్కారమైన కేసులను 22ఏ జాబితా నుంచి తొలగించనున్నారు. అసైన్డ్‌ భూముల్లో నిర్మించిన ఇళ్ల విషయంలో సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లపై కూడా సంప్రదింపులు జరపనున్నారు. లబ్ధిదారుల సొంత స్థలాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల లాక్‌ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతించనున్నారు. నాలా రుసుము చెల్లించని ప్రైవేటు పట్టా భూములకు నాలా ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించేలా చేసి క్రయవిక్రయాలకు అనుమతి ఇవ్వనున్నారు.

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ

ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలను కొత్త క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని లీజ్‌హోల్డ్‌ ఆస్తుల ఫ్రీహోల్డ్‌ క్రమబద్ధీకరణ కేసులను 30 రోజుల్లో పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్డ్‌ భూములు, భూదాన్‌ భూములను సమగ్ర ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా సమీకరించే నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేదల గృహ నిర్మాణానికి వినియోగించనున్నట్లు సీఎం తెలిపారు.

Advertisement
Advertisement