Gold And Silver Prices Today | బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ గత వారం రోజుల నుంచి భారీ నష్టాలు వస్తుండడంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే తాజాగా బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ గత వారం రోజుల నుంచి భారీ నష్టాలు వస్తుండడంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే తాజాగా బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం భారీగా పెరిగిన ఆయా ధరలు గురువారం కాస్త కరెక్షన్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం మేర స్వల్పంగా తగ్గి 4,123 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.05 శాతం తగ్గి 59 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 618 పాయింట్ల మేర స్వల్పంగా తగ్గి 1,45,063 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 844 పాయింట్లు తగ్గి 2,26,154 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,728 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 824గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,47,280 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,72,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,500 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,08,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,35,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,50,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,046 ఉండగా, 8 గ్రాముల ధర రూ.88,368గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,10,460 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,04,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,800 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్‌లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 15, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు



