Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court)లో కార్యకలాపాల నిర్వహణకు హిందీని అధికారిక భాషగా కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు భాషకు సంబంధించిన మార్పులు న్యాయపరమైన ఆదేశాల ద్వారా సాధ్యం కావని, దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : సుప్రీంకోర్టు (Supreme Court)లో కార్యకలాపాల నిర్వహణకు హిందీని అధికారిక భాషగా ఉపయోగించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. బ్రహ్మేశ్వర్ నాథ్ మిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని వాదనలు, తీర్పులన్నీ ప్రధానంగా ఆంగ్ల భాషలోనే కొనసాగాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు భాషకు సంబంధించిన మార్పులు న్యాయపరమైన ఆదేశాల ద్వారా సాధ్యం కావని, దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినప్పటికీ, సామాన్య ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేసేందుకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం ద్వారా క్రమంగా సంస్కరణలు ప్రవేశపెడుతోందని వివరించింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం అన్ని తీర్పుల వివరాలను హిందీలోనూ ఇస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ తీర్పుల వివరాలను అందుబాటులోకి తీసుకువస్తామని సీజేఐ వివరించారు. దేశంలోని భాషా సంస్కృతిని కాపాడుతూ.. ప్రాంతీయ భాషలను గౌరవిస్తామని స్పష్టం చేశారు.
Also Read..
జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్






