త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ క‌మ్యూనిటీలో రికార్డు ధ‌ర ప‌లికిన వినాయ‌క ల‌డ్డూ.. ఎంతంటే..

Kohinoor Gated Community | మాదాపూర్‌- హైటెక్ సిటీలోని అరబిందో కొహినూర్ గేటెడ్ కమ్యూనిటీ వినాయకుడి లడ్డూ రికార్డు ధ‌ర ప‌లికింది. కిట్టీ కింగ్స్ ఏకంగా రూ.30,50,001ల‌కు మహా లడ్డూను సొంతం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Sep 25, 2026, 4.33 pm IST

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ క‌మ్యూనిటీలో రికార్డు ధ‌ర ప‌లికిన వినాయ‌క ల‌డ్డూ.. ఎంతంటే..
Advertisement

Kohinoor Gated Community | త్రినేత్ర న్యూస్: మాదాపూర్‌- హైటెక్ సిటీలోని అరబిందో కొహినూర్ గేటెడ్ కమ్యూనిటీ వినాయకుడి లడ్డూ రికార్డు ధ‌ర ప‌లికింది. కిట్టీ కింగ్స్ ఏకంగా రూ.30,50,001ల‌కు మహా లడ్డూను సొంతం చేసుకున్నారు. శుక్ర‌వారం ఎంతో ఉత్సాహంగా సాగిన వేలంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ కోహినూర్ ఫెస్టివ‌ల్ కమిటీ స‌భ్యులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వేలంలో ప్ర‌సాదాల‌ను, ప‌లు వ‌స్తువుల‌ను ద‌క్కించుకున్న వారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అందరి సహకారంతో ఏటా కోహినూర్ గణేష్ ఉత్సవాలను వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నామ‌ని స‌భ్యులు పేర్కొన్నారు.

విజయ్ కృష్ణ నోట్ల మాలను రూ.3,35,000 ల‌కు సొంతం చేసుకున్నారు. నాగ మల్లేశ్వర రావు రూ.3,20,000ల‌కు పట్టు చీరను, హనుమంత రావు రూ.7,00,000కు క‌ల‌శాన్ని, హరీందర్ సాహు రూ.4,21,000ల‌కు పంచ కండువాను ద‌క్కించుకున్న‌ట్లు కోహినూర్ ఫెస్టివ‌ల్ క‌మిటీ స‌భ్యులు వివ‌రించారు.

Advertisement
Advertisement