Brij Bhushan Sharan Singh | లైంగిక వేధింపుల కేసు..బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని ఢిల్లీ కోర్టులో సవాల్ చేసిన మహిళా రెజ్లర్లు
Brij Bhushan Sharan Singh | లైంగిక వేధింపుల కేసు (Wrestlers Sexual Harassment Case)లో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను నిర్దోషిగా విడుదల చేస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును నలుగురు మహిళా రెజ్లర్లు (women wrestlers) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేశారు.
Brij Bhushan Sharan Singh | త్రినేత్ర న్యూస్ : లైంగిక వేధింపుల కేసు (Wrestlers Sexual Harassment Case)లో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను నిర్దోషిగా విడుదల చేస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును నలుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేశారు. బ్రిజ్ భూషణ్‌తో పాటు ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ విడుదలను కూడా సవాల్ చేశారు. మెజిస్ట్రేట్ తీర్పు చట్టప్రకారం చెల్లదని రెజ్లర్లు తమ అప్పీల్‌లో పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాలను కోర్టు పాక్షికంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుందని ఆరోపించారు. ఈ అప్పీల్‌ను రౌస్ అవెన్యూ కోర్టుకు చెందిన ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్ శనివారం విచారించే అవకాశం ఉంది.
కాగా, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు 2023లో బ్రిజ్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వినేష్ ఫొగాట్ సహా మొత్తం ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్‌లపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితర టాప్ రెజ్లర్లు (Wrestlers) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొన్ని నెలలపాటూ ఆందోళనలు సైతం కొనసాగించిన విషయం తెలిసిందే.
మే-జూన్ మధ్య బ్రిజ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో.. ఢిల్లీ పోలీసులు 2023 జూన్ 15న 1500 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 2024 మేలో ట్రయల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బ్రిజ్‌ను మెసిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గత నెల 3న కీలక తీర్పు వెలువరించింది. సహ నిందితుడిగా ఉన్న వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పును మహిళా రెజ్లర్లు తాజాగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
బీహార్‌లో మరో మైనర్‌పై దాడి.. వారం రోజుల్లో మూడో ఘటన
స్టాక్ మార్కెట్లకు వారాంతంలో ఊరట.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..
భార్యతో విడాకులు.. పసుపు, పాలు, కొబ్బరినీళ్లతో తండ్రీకూతురు స్నానం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్






