త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala | జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Chamala | కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జరుగుతున్న ప్రక్రియను వెంటనే నిలిపివేసి.. ఇటీవల జరిగిన ఎన్నికలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

P

Telangana | Published On Sep 25, 2026, 4.46 pm IST

Chamala | జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
Advertisement
  • ఎన్నికల సంఘం వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Chamala | కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జరుగుతున్న ప్రక్రియను వెంటనే నిలిపివేసి.. ఇటీవల జరిగిన ఎన్నికలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను సీజేఐ, ఇతర సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేసే సంప్రదాయం ఉండేదని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇద్దరూ కావాలనే సీజేఐను తప్పించి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించారని ఆరోపించారు.

సెలెక్షన్‌ ప్రాసెస్‌లో ఎన్నికల కమిషన్‌ను బీజేపీ తమ ఆధీనంలో పెట్టుకుందని విమర్శించారు. ‘ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తప్పించాలంటే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం పెట్టాలి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జ్ఞానేశ్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి’ అన్నారు. రాజ్యాంగంలో ఉన్న ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతోందని చామల ఆరోపించారు. ‘ఫామ్‌–6 ద్వారా ఓట్లను తొలగించి తిరిగి వారికి అవకాశం ఇవ్వడం లేదు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారు’ అని ఆరోపించారు.

ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని మండిప‌డ్డారు. ‘గుజరాత్‌ మోడల్‌ తరహాలో ఎప్పటికీ దేశంలో అధికారం మాదే అనే భ్రమలో మోదీ, అమిత్‌షా ఉన్నారు. సెక్యులర్‌ దేశాన్ని బీజేపీ భ్రష్టు పట్టించింది’ అని చామల వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘హర్యానా ఎన్నికల ఫుటేజ్‌ రాహుల్‌గాంధీ అడిగితే ఇవ్వలేదు. 45 రోజుల వరకు సీసీటీవీ ఫుటేజ్‌ ఉంచాలి’ అని గుర్తు చేశారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా బల్క్‌ ఓట్లను నమోదు చేశారని, ఫొటోగ్రఫీలను మార్చారని ఆరోపించారు. ‘వీటన్నింటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. వెంటనే జ్ఞానేశ్‌ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలి’ అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement