E20 fuel | E20 లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది : కేంద్రం
E20 fuel | ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించుకుంది. ఈ20పై వెనక్కి తగేది లేదని స్పష్టం చేసింది. E20 లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేదని పేర్కొంది.
E20 fuel | త్రినేత్ర.న్యూస్ : ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించుకుంది. ఈ20పై వెనక్కి తగేది లేదని స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ యుద్ధం సమయంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు మన దేశంలో వినియోగదారులపై భారం పడకుండా ఈ విధానం కీలక పాత్ర పోషించిందని తెలిపింది.
ముడి చమురు బ్యారెల్ ధర 135 డాలర్లకు చేరిన రోజుల్లో ఇథనాల్ బ్లెండింగ్ లేకపోయి ఉంటే న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ (Petrol) ధర రూ.125కు చేరేదని పేర్కొంది. ఈ20 పెట్రోల్ విధానం వల్ల లీటరుకు రూ. 30 ఆదా అయిందని వివరించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
"ఇరాన్ యుద్ధ సమయంలో ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు చేరాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ క్లోజ్ అవ్వడం వల్లే ధరలు ఈ స్థాయికి చేరుకున్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ కీలక పాత్ర పోషించింది. ఈ20 పెట్రోల్ లేకపోయి ఉండి ఉంటే ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.125కు చేరేది. లీటర్ పెట్రోల్‌లో 20 శాతం వరకూ ఇథనాల్ కలపడం వల్లే పెరిగిన ముడి చమురు ధరల భారం ప్రజలపై పడకుండా అడ్డుకోగలిగాం. వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారు" అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
కాగా, కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిందని, నిర్వహణ ఖర్చులు పెరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, E20 వల్ల మైలేజ్ తగ్గు మాట వాస్తవమే అయినప్పటికీ.. దానివల్ల లభించే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. E20 పెట్రోల్ కారణంగా కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గొచ్చని వెల్లడించింది.
ఆ వాహనాల్లో కొన్ని మార్పులు అవసరం..
మరోవైపు ఈ20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న సందేహాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారత్ స్టేజ్-3 (బీఎస్-3) ప్రమాణాలకు చెందిన 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహనాల్లో 2016కు ముందు తయారైన కొన్ని మోడళ్లకు మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్ల మార్పు అవసరం కావొచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ20 (80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్) వినియోగంతో వాహనాల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనలపై స్పందిస్తూ.. వాహనం మైలేజీ కేవలం ఇంధన రకంపైనే ఆధారపడదని, డ్రైవింగ్ విధానం, వాహన పరిస్థితి వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని వాహన తయారీ సంస్థలు, టెస్ట్ కంపెనీలు స్పష్టం చేశాయని తెలిపారు.
Also Read..
కాక్రోచ్‌ల భయం.. సీజేఐ పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసిన టిస్
కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. దెబ్బతిన్న దుకాణాలు, వాహనాలు
సంబంధిత వార్తలు

Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
అక్టోబర్ 3, 2026

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
సెప్టెంబర్ 9, 2026

Supreme Court | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని కచ్చితంగా వెల్లడించాలి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
- ●CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
- ●Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
- ●Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ
- ●Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
- ●Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన

Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్

Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ



