త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Phones | రూ.30వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామ‌ర్స్ వేదిక‌ల్లో డీల్స్‌..

Smart Phones | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సేల్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రూ.30వేల బడ్జెట్‌లో 5జి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 ప్రొ 5జి, గెలాక్సీ ఎం47 5జి ఇప్పటికే ఈ బడ్జెట్‌లోకి వచ్చాయి. మరికొన్ని ఫోన్లు కూడా సేల్‌ సమయంలో భారీ డిస్కౌంట్‌ లభిస్తే రూ.30 వేలలోకి వచ్చే అవకాశం ఉంది.

S

Technology | Published On Oct 3, 2026, 1.53 pm IST

Smart Phones | రూ.30వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామ‌ర్స్ వేదిక‌ల్లో డీల్స్‌..
Advertisement

Smart Phones | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సేల్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రూ.30వేల బడ్జెట్‌లో 5జి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 ప్రొ 5జి, గెలాక్సీ ఎం47 5జి ఇప్పటికే ఈ బడ్జెట్‌లోకి వచ్చాయి. మరికొన్ని ఫోన్లు కూడా సేల్‌ సమయంలో భారీ డిస్కౌంట్‌ లభిస్తే రూ.30 వేలలోకి వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 ప్రొ 5జి ప్రస్తుతం అమెజాన్‌లో రూ.26,288కి లిస్ట్‌ అయింది. దీంతో రూ.30 వేల బడ్జెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫోన్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇందులో 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 ఇంచుల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఫొటోగ్రఫీ కోసం ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఓఐఎస్‌)తో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్స‌ల్‌, 2 మెగాపిక్స‌ల్‌ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్స‌ల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇందులో అందించారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం47 5జి..

శాంసంగ్‌ గెలాక్సీ ఎం47 5జి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.28,999 ధరకు లభిస్తోంది. 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఓఐఎస్‌తో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్స‌ల్‌, 2 మెగాపిక్స‌ల్‌ కెమెరాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్స‌ల్‌ కెమెరా, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. పోకో ఎక్స్‌8 5జి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.39,999 ధ‌ర‌కు ఉంది. కాబట్టి రూ.30 వేలలోకి రావాలంటే గణనీయమైన డిస్కౌంట్‌ అవసరం. అయితే రానున్న సేల్స్‌లో ఈ ధ‌ర లోపు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందులో 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.83 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 4 చిప్‌సెట్‌, 50 మెగాపిక్స‌ల్ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్‌ సెల్ఫీ కెమెరా, 9,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి.

వీవో టి5 5జి..

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వీవో టి5 5జి ఫోన్‌ ధర రూ.39,999గా ఉంది. 1.5కె రిజల్యూషన్‌, 144 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.83 ఇంచుల కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇందులో ఉంది. డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌, ఓఐఎస్‌తో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్‌ అల్ట్రా-వైడ్‌ కెమెరా, 32 మెగాపిక్స‌ల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. 44 వాట్‌ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,050 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐక్యూ జ‌డ్‌11 5జి ఫోన్‌ ప్రస్తుతం రూ.34,999కి లిస్ట్‌ అయింది. 6.83 ఇంచుల 1.5కె 144 హెడ్జ్‌ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌, సోనీ సెన్సార్‌తో 50 మెగాపిక్స‌ల్‌ ఓఐఎస్‌ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్‌ అల్ట్రా-వైడ్‌ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్‌ సెల్ఫీ కెమెరా, 44 వాట్‌ ఛార్జింగ్‌తో 7,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ 5జి..

అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ 5జి ఫోన్‌ ధర ప్రస్తుతం రూ.34,499గా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 4 ప్రాసెసర్‌, 144 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉన్నాయి. 68 వాట్‌ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరాను ఇందులో అందించారు. ఇక మిగిలిన ఫోన్లతో పోలిస్తే రియల్‌మి పి4 పవర్ 5జి రూ.30 వేల ధరకు అత్యంత దగ్గరగా ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం దీని ధర రూ.31,824గా ఉంది. 144 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 ఇంచుల అమోలెడ్‌ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌, ఓఐఎస్‌తో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్స‌ల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 10,001 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

సేల్స్ స్టార్ట్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాలి..

ప్రస్తుతం ఉన్న లిస్టింగ్‌ ధరలను బట్టి చూస్తే శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 ప్రొ 5జి, గెలాక్సీ ఎం47 5జి ఇప్పటికే రూ.30 వేల బడ్జెట్‌లో ఉన్నాయి. రియల్‌మి పి4 పవర్ 5జి ఈ పరిమితికి కొద్దిగా పైన ఉంది. ఐక్యూ జ‌డ్‌11 5జి, మోటరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ 5జి, పోకో ఎక్స్‌8 5జి, వీవో టి5 5జి వంటి ఫోన్లు రూ.30 వేలలోకి రావాలంటే మరింత భారీ డిస్కౌంట్లు అవసరం. సేల్స్‌ ప్రారంభమైన తర్వాత అసలు డిస్కౌంట్‌ ధరలు, బ్యాంక్‌ ఆఫర్లు, ఇతర అదనపు తగ్గింపులు కీలకంగా మారనున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న ధరలను ఒక బెంచ్‌మార్క్‌గా పెట్టుకుని, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో తుది ధరలు ఎంతకు వస్తాయో పరిశీలించడం ద్వారా రూ.30 వేల బడ్జెట్‌లో ఈ ఫోన్లలో ఏవి అందుబాటులోకి వస్తాయో తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement