Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు వేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారంతో పాటు తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
- రుసుము చెల్లింపుతో భూముల రిజిస్ట్రేషన్లు
- కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశాం
- రెవెన్యూ మంత్ర పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: 22ఏ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు వేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారంతో పాటు తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నాలా రుసుము చెల్లింపుతో అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్లకు సైతం మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన శనివారం మాట్లాడారు.
నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నాం. మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా ఉత్తర్వులు ఇచ్చాం. అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. 22ఏ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం పెంచాం. ఇప్పటికే ఐదు ఉత్తర్వులు జారీ చేశాం.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, GO 118, GO 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇస్తున్నాం. GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు ఉన్న 22ఏ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అధికారుల కనీస బాధ్యత. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. 22ఏ సమస్యల పరిష్కారంపై నిరంతరం మానిటరింగ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాను అని పొంగులేటి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?
అక్టోబర్ 3, 2026

Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే
అక్టోబర్ 3, 2026

Bus Accident | అంత్యక్రియలకు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..
- ●Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్
- ●Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..
- ●Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్
- ●Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..

Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..



