Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ – లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఎపిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆదిత్య హసన్ దర్శకత్వం వహించిన ఈ జెన్‌జీ లవ్‌స్టోరీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Oct 3, 2026, 2.50 pm IST
Vaishnavi Chaitanya |బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ఎపిక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌లోని బోల్డ్ సీన్లు, లిప్‌లాక్‌తో పాటు భారీ ప్రమోషన్ల కారణంగా ఎపిక్ మూవీ రిలీజ్‌కు ముందు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ జెన్‌జీ లవ్‌స్టోరీని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఓటీటీలోకి...
తాజాగా ఎపిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పది కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
లిప్‌లాక్‌లు...
నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్‌లోని కొన్ని పాత్రలను తీసుకొని దర్శకుడు ఆదిత్య హసన్ ఈ సినిమాను రూపొందించారు. ఎపిక్‌లో శివాజీ, వాసుకి తో పాటు డైరెక్టర్లు కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ఎపిక్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లో, బోల్డ్ సీన్లు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఉన్న సహజత్వం, ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్సయ్యాయి.
కడలితో ఆదిత్య ప్రేమాయణం...
ఆదిత్య సినిమాల్లో డైరెక్టర్‌గా స్థిరపడాలని కలలు కంటాడు. కానీ తండ్రి ఒత్తిడి వల్ల ఇష్టం లేకపోయినా ఉన్నత చదువుల కోసం లండన్ వెళతాడు. అక్కడ ఆదిత్యకు కడలి పరిచయమవుతుంది. ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటారు. వారి మధ్య పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ప్రేమ పెళ్లి విషయంలో ఆదిత్య, కడలి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ – హాట్ ఫొటోలతో షేక్
అక్టోబర్ 2, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – మలయాళం మూవీ హైలైట్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
- ●Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
- ●Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ
- ●Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం
- ●Smart Phones | రూ.30వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఇవే.. ఈ-కామర్స్ వేదికల్లో డీల్స్..
- ●Rahul Gandhi | దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన

Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్

Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ

Ponguleti Srinivas Reddy | నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం



