త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | అక్టోబ‌ర్ 10న చ‌లో జంత‌ర్ మంత‌ర్‌.. సీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

CJP | కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఈసీ రాజీనామా చేయ‌క‌పోతే అక్టోబ‌ర్ 10న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చరించింది.

D

National | Published On Oct 3, 2026, 2.21 pm IST

CJP | అక్టోబ‌ర్ 10న చ‌లో జంత‌ర్ మంత‌ర్‌.. సీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

CJP | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా కోరుతూ నిన్న ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ పార్క్‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టిన సీజేపీ.. ఇప్పుడు చ‌లో ఢిల్లీ (Delhi)కి పిలుపునిచ్చింది. సీఈసీ రాజీనామా చేయ‌క‌పోతే అక్టోబ‌ర్ 10న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చరించింది. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం సీజేపీ త‌న అధికారిక‌ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టింది.

"సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయకపోతే.. అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా ఉన్న బొద్దింకలు (Cockroaches) ఢిల్లీలోని జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్తాయి. దారిలో ఎక్క‌డైనా పోలీసులు మ‌మ్మ‌ల్ని అడ్డుకుంటే.. వారు ఎక్క‌డైతే మ‌మ్మ‌ల్ని ఆపుతారే అదే మాకు జంత‌ర్ మంత‌ర్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛాయుత, నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల‌ను కాపాడే పోరాటంలో మేము మ‌హాత్మా గాంధీ (Mahatma Gandhi) చూపిన‌ మార్గాన్ని అనుసరిస్తాం" అని సీజేపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఈ శాంతియుత ఆందోళనలో ప్రజలు, పౌరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

Also Read..

షాకింగ్‌.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్య‌క్తి.. రెండు ముక్క‌లైన బాడీ

దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్‌

వినియోగ‌దారుల‌కు షాక్‌.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెంపు

Advertisement
Advertisement