త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Man Jumps Off 43rd Floor | షాకింగ్‌.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్య‌క్తి.. రెండు ముక్క‌లైన బాడీ

Man Jumps Off 43rd Floor | నోయిడా (Noida)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సెక్టార్ 94లో ఉన్న సూప‌ర్ నోవా సొసైటీ (Supernova Society) భవనంపై నుంచి దూకి ఓ వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

D

National | Published On Oct 3, 2026, 2.03 pm IST

Man Jumps Off 43rd Floor | షాకింగ్‌.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్య‌క్తి.. రెండు ముక్క‌లైన బాడీ
Advertisement

Man Jumps Off 43rd Floor | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడా (Noida)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సెక్టార్ 94లో ఉన్న సూప‌ర్ నోవా సొసైటీ (Supernova Society) భవనంపై నుంచి దూకి ఓ వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలో (Sector 126 Police Station) శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. మృతుడు ఘ‌ట‌న‌కు ఒక్క‌రోజు ముందు ఆ భవనంలో ఒక రూమ్‌ను అద్దెకు బుక్ చేసుకున్నాడు. ఇవాళ ఉద‌యం భ‌వ‌నం 43వ అంత‌స్తుపైకి వెళ్లి అక్క‌డి నుంచి ఒక్క‌సారిగా కింద‌కు దూకేశాడు (Man Jumps Off 43rd Floor). అంత ఎత్తు నుంచి దూక‌డంతో అత‌డి బాడీ రెండు ముక్క‌లైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుడి వివ‌రాలు తెలియ‌రాలేదు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల కార‌ణంగా తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన అత‌డు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటాడ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రోవైపు తాజా ఘ‌ట‌న నేప‌థ్యంలో సూపర్ నోవా రెసిడెంట్స్ అసోసియేషన్ (Supernova Apartment Owners Association) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫ్లాట్ యజమానులు త‌మ ఇళ్ల‌ను అథితుల‌కు అద్దెకు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆదేశించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తూ ఓ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

Also Read..

దేశవ్యాప్త నిరసనలను ఒకే వేదిక.. 'సత్యాగ్రహ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన రాహుల్‌

వినియోగ‌దారుల‌కు షాక్‌.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెంపు

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ డీల్స్ రివీల్‌.. ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్‌..

Advertisement
Advertisement