త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor |జాన్వీక‌పూర్‌ డీప్ ఫేక్ వీడియో – ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌నంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ వార్నింగ్‌

దేవ‌ర సినిమాలోని చుట్ట‌మ‌ల్లే సాంగ్‌లోని విజువ‌ల్స్‌ను కొంద‌రు ఏఐ సాయంతో మార్ఫింగ్ చేశారు. జాన్వీ క‌పూర్‌ను అస‌భ్య‌క‌రంగా చిత్రీక‌రించారు. ఈ మార్ఫింగ్ వీడియోల‌పై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. మ‌హిళ‌ల‌ను దేవ‌త‌లుగా పూజించే నేల‌పై ఇలాంటి నీచ‌మైన ప‌నులు చేయ‌డం సిగ్గుచేటు అని అన్నారు.

N

Entertainment | Published On Oct 3, 2026, 2.05 pm IST

Janhvi Kapoor |జాన్వీక‌పూర్‌ డీప్ ఫేక్ వీడియో –  ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌నంటూ  జూనియ‌ర్ ఎన్టీఆర్‌ వార్నింగ్‌
Advertisement

Janhvi Kapoor |  ఏఐ సాయంతో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా కంటెంట్‌ను క్రియేట్ చేయ‌డం అస‌హ్య‌క‌రం... సిగ్గుచేటు అని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ దేవ‌ర సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాతోనే ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దేవ‌ర సినిమాలోని చుట్ట‌మ‌ల్లే సాంగ్‌లోని కొన్ని విజువ‌ల్స్‌ను ఏఐ సాయంతో కొంద‌రు మార్ఫింగ్ చేశారు. జాన్వీ క‌పూర్‌ను చాలా అస‌భ్య‌క‌రంగా చిత్రీక‌రించారు. ఈ మార్ఫింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మాతృదేవోభ‌వ‌...

ఈ డీప్ ఫేక్ వీడియోపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. "మ‌హిళ‌ల‌ను దేవత‌లుగా, తల్లులుగా పూజించే ఈ నేల‌పై మాతృదేవోభ‌వ అనేది కేవలం ఒక సామెత మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఓ భాగం. ఈ నేల‌పై ఒక మహిళను కించపర‌చ‌డానికి ఏఐ ని దుర్వినియోగం చేసే స్థాయికి కొంత మంది దిగ‌జారిపోయారు. ఆధునిక సాంకేతిక‌త‌తో ఇలాంటి నీచమైన ప‌నిచేయ‌డం మాటల్లో చెప్పలేనంత జుగుప్స‌క‌రంగా అనిపిస్తోంది " అని అన్నారు.

చుట్ట‌మ‌ల్లే...

అంతే కాకుండా చుట్టమల్లె మార్ఫింగ్‌ వీడియో వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టను.ఈ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాను. దయచేసి ఇటువంటి మార్ఫింగ్ కంటెంట్‌ను చూడకండి, షేర్ చేయకండి ఈ మార్ఫింగ్‌, డీప్ ఫేక్ వీడియోల‌పై ప్రభుత్వాలు స్పందించాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కఠినమైన నిబంధనలను తీసుకురావాలని నేను గట్టిగా కోరుతున్నాను" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.   ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.మార్ఫింగ్ వీడియోపై జాన్వీక‌పూర్ కూడా రియాక్ట్ అయ్యింది. లీగ‌ల్‌గానే తాను యాక్ష‌న్ తీసుకుంటాన‌ని  చెప్పింది. ఈ మార్ఫింగ్ వీడియోల‌పై ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌కు మ‌ద్ద‌తుగా ప‌లువురు నెటిజ‌న్లు నిలుస్తోన్నారు.

Advertisement
Advertisement