Supreme Court | సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టులో సవాల్
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : సర్ వివాదం, ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది. వారికి వ్యతిరేకంగా కో వారంటో రిట్ (writ of quo warranto) జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అంతేకాకుండా వారి నియామకాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు.
వారి నియామకాలు 2023 నాటి సీఈసీ, ఈసీల చట్టం ప్రకారం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించాయని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. అంతేకాకుండా తొందరపాటు నియామకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సెలక్షన్ కమిటీ సభ్యులకు పూర్తి వివరాలు అందించిన తర్వాతే నియామకాలు చేపట్టాలని మార్చి 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం.. ప్రతి ఖాళీకి 5 పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ జరగలేదని పిటిషనర్ వాదించారు. అంతేకాకుండా ఈ అధికారుల్లో ఎవరూ గతంలో ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను నిర్వహించలేదని, వారు సెక్షన్ 5 కింద నిర్దేశించిన అర్హతా ప్రమాణాలను అందుకోలేదని పేర్కొన్నారు.
Also Read..
సైబర్ మోసాలపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం : ప్రధాని మోదీ
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వేళ.. ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్
బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల్లో విలన్‌గా నానా పటేకర్ - మిస్సయిన ఛాన్స్‌లు!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





