PM Modi | సైబర్ మోసాలపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం : ప్రధాని మోదీ
PM Modi | ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే టెక్నాలజీ నిజమైన స్థాయిలో విజయవంతం కాగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు ఓ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ (global framework) అత్యంత అవసరమని నొక్కి చెప్పారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో మన ఫోన్లు, నెట్‌వర్క్‌ల భద్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. టెలికాం (telecom), డిజిటల్ టెక్నాలజీ (digital technology) రంగాలు వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సైబర్ భద్రత, నెట్‌వర్క్ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే టెక్నాలజీ నిజమైన స్థాయిలో విజయవంతం కాగలదని అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress)లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. సైబర్ మోసాలు, సైబర్ నేరాలు ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదన్నారు. డిజిటల్ ముప్పులు దేశ సరిహద్దులను దాటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్‌లు ప్రస్తుతం ఎంతటి పెద్ద సవాలుగా మారుతున్నాయో మనందరికీ తెలుసునన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఓ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ (global framework ) అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రభుత్వాలు, టెక్నాలజీ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "ఇలాంటి మోసాలు ప్రజల వరకు చేరకుండా ముందే అడ్డుకోగల ఒక గ్లోబల్ మెకానిజమ్‌ను అందరం కలిసి రూపొందిద్దాం. ఈ దిశగా భారత్ తన స్వంత అనుభవాల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంది" అని ప్రధాని తెలిపారు.
కంటెంట్ క్రియేషన్..
దేశంలో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు దేశీయంగా డిజిటల్ విప్లవానికి, ముఖ్యంగా కంటెంట్ రంగానికి సరికొత్త ఊపును అందించాయని ప్రధాని మోదీ తెలిపారు. మొబైల్ ఫోన్ల విప్లవం వల్ల కంటెంట్ సృష్టి అనేది కొద్దిమందికే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. కంటెంట్ వినియోగాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. మెరుగైన కనెక్టివిటీతోపాటూ చౌకైన డేటా అందుబాటులోకి రావడంతో కేవలం నగరాలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ భాషల్లో ఉండే ఓటీటీ వేదికలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయని వివరించారు. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులోకి రావడం వల్ల, గతంలో ప్రజలు ఎదుర్కొన్న భాషాపరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో కంటెంట్ క్రియేషన్ అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదని.. అది వేల కోట్ల రూపాయల విలువైన భారీ పరిశ్రమగా ఎదిగిందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇది లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.
Also Read..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వేళ.. ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్
బెంగళూరులో సీజేపీ చెప్పుల నిరసన.. ప్రకాశ్ రాజ్ మద్దతు
అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. రూ.17,901 వరకు ఆదా..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం
అక్టోబర్ 9, 2026

PM Modi | నోయిడా ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ పేరు.. యూపీ సర్కార్ సంచలన నిర్ణయం
అక్టోబర్ 9, 2026

Supreme Court | నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ షట్డౌన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాదులు
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు



