త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nana Patekar | బాల‌కృష్ణ, వెంక‌టేష్ సినిమాల్లో విల‌న్‌గా నానా ప‌టేక‌ర్ – మిస్స‌యిన ఛాన్స్‌లు!

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో వంద‌కుపైగా సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించారు నానా ప‌టేక‌ర్‌. తెలుగులోనూ ఈ విల‌క్ష‌ణ న‌టుడికి అవ‌కాశాలు వ‌చ్చాయి. వెంక‌టేష్, బాల‌కృష్ణ సినిమాల్లో నానా ప‌టేక‌ర్ విల‌న్‌గా న‌టించాల్సింది. చివ‌రి నిమిషంలో ఈ ఆఫ‌ర్లు చేజారాయి.

N

Entertainment | Published On Oct 8, 2026, 1.25 pm IST

Nana Patekar | బాల‌కృష్ణ, వెంక‌టేష్ సినిమాల్లో విల‌న్‌గా నానా ప‌టేక‌ర్ –  మిస్స‌యిన ఛాన్స్‌లు!
Advertisement

Nana Patekar |

యాభై ఏళ్ల‌ సినీ ప్ర‌యాణంలో వంద‌కుపైగా సినిమాల్లో న‌టించారు బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ నానా ప‌టేక‌ర్‌. రాశి కంటే వాసికే ఎక్కువ‌గా ప్రాముఖ్య‌త‌నిచ్చారు. వ‌చ్చిన అవ‌కాశాలు కాకుండా త‌న మ‌న‌సుకు న‌చ్చిన సినిమాలు మాత్ర‌మే చేశారు. రెమ్యూన‌రేష‌న్లు, అవార్డుల , పేరు ఇవేవీ శాశ్వ‌తం కాద‌ని ఆయ‌న న‌మ్మేవారు.ఒకానొక ద‌శ‌లో బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నానా ప‌టేక‌ర్ నిలిచారు. ఒక్కో సినిమాకు కోటికిపైగా పారితోషికం స్వీక‌రించారు.

తెలుగు ఇండ‌స్ట్రీతో...

టాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేక‌పోయినా తెలుగు ఇండ‌స్ట్రీతో నానా ప‌టేక‌ర్‌కు మంచి అనుబంధ‌ముంది. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప‌లు హిందీ సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి.బాలీవుడ్ సినిమాల‌తో న‌టుడిగా స‌త్తాచాటిన నానా ప‌టేక‌ర్‌కు తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. వెంక‌టేష్‌, బాల‌కృష్ణ ల‌తో నానా ప‌టేక‌ర్ సినిమాలు చేయాల్సింది. కానీ రెమ్యూన‌రేష‌న్‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆ అవ‌కాశాలు చేజారాయి.

ప్రేమించుకుందాం రా...

వెంక‌టేష్ హీరోగా జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమించుకుందాం రా సినిమాలో విల‌న్ పాత్ర కోసం నానా ప‌టేక‌ర్‌ను తీసుకోవాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అనుకున్నారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ రోల్‌ కోసం ఆయ‌న్ని సంప్ర‌దించారు. కానీ ఈ విల‌న్ పాత్ర కోసం కోటిన్న‌ర వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ను నానా ప‌టేక‌ర్ అడిగారు. ఆయ‌న చెప్పిన పారితోషికం విని మేక‌ర్స్ వెన‌క్కి త‌గ్గారు. నానా ప‌టేక‌ర్ కోసం అనుకున్న పాత్ర‌ను జ‌య‌ప్ర‌కాష్ రెడ్డితో చేయించారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వ‌డ‌మే కాకుండా జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ యాక్ట‌ర్‌గా మారిపోయారు.

భైర‌వ‌ద్వీపంలో...

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఫాంట‌సీ మూవీ భైర‌వ‌ద్వీపంలో మాంత్రికుడి పాత్రకు నానా ప‌టేక‌ర్ అయితే బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు భావించారు. ఈ బాలీవుడ్ యాక్ట‌ర్‌ను అప్రోచ్ అయ్యారు. అప్ప‌టికే నాలుగైదు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న నానా ప‌టేక‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేశారు. అలా రెండు సార్లు తెలుగులో సినిమా చేసే అవ‌కాశాన్ని నానా ప‌టేక‌ర్ కోల్పోయారు.

తెలుగులోకి రీమేక్‌....

నానా ప‌టేక‌ర్ హీరోగా న‌టించిన ప‌లు సూప‌ర్‌హిట్‌ బాలీవుడ్ మూవీస్ తెలుగులోకి రీమేక్ అయ్యాయి. . క్రాంతివీర్‌, టాక్సీ నంబ‌ర్ 9211 సినిమాలు పుణ్య‌భూమి నా దేశం, గేమ్ పేర్ల‌తో మోహ‌న్‌బాబు రీమేక్ చేశారు. నానా ప‌టేక‌ర్ మ‌రాఠీ మూవీ న‌ట‌సామ్రాట్ ఆధారంగా తెలుగులో రంగ‌మార్తండ సినిమా రూపొందింది. ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నానా ప‌టేక‌ర్ మ‌రో మూవీ య‌శ్వంత్‌ సంచ‌ల‌నం అనే టైటిల్‌తో తెలుగులోకి రీమేక్ కాగా...ఇందులోనూ ప్ర‌కాష్ రాజ్ హీరోగా న‌టించాడు.

Advertisement
Advertisement