Fly91 Airlines | హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానంలో సాంకేతిక సమస్య.. 4 గంటలపాటూ గాల్లోనే చక్కర్లు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
Fly91 Airlines | హైదరాబాద్ నుంచి హుబ్లీ (Hyderabad to Hubballi) వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య (technical issue) ఎదురైంది. దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు.
Fly91 Airlines | హైదరాబాద్ నుంచి హుబ్లీ (Hyderabad to Hubballi) వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య (technical issue) ఎదురైంది. దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. అయితే, అక్కడ వాతావరణం అనుకూలింకపోవడంతో ల్యాండింగ్‌కు వీలు కాలేదు. ఫలింతగా విమానం దాదాపు నాలుగు గంటలపాటూ గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఊహించని పరిణామంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఫ్లై91 (Fly91) ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 (ATR టర్బోప్రాప్ AT7) విమానం.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. సాయంత్రం 4:30 గంటలకు హుబ్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం మరికాసేపట్లో హుబ్లీ చేరుకుంటుందనగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం బెంగళూరుకు దారి మళ్లించారు.
అదే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌కు వీలు కాలేదు. ఫలితంగా ముండగోడ్, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాల్లో విమానం సుమారు 4 గంటల పాటూ గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. ఓ మహిళ వణికిపోతూ.. దేవుడా క్షేమంగా కిందకు దిగాలి అంటూ అరుస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక వాతావరణం అనుకూలించిన తర్వాత విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత హుబ్లీ బయల్దేరి వెళ్లింది. ఆ విమానం హుబ్లీ చేరుకునే సరికి రాత్రి 11 గంటలు అయ్యిందని అధికారులు తెలిపారు. అందులోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read..
దళపతి విజయ్ విడాకుల కేసు వాయిదా - భర్త ఆస్తిలో సగం భరణంగా కావాలన్న సంగీత?
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





