త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల కేసు వాయిదా – భ‌ర్త‌ ఆస్తిలో స‌గం భ‌ర‌ణంగా కావాల‌న్న సంగీత?

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంగీత‌ల విడాకుల కేసు వాయిదాప‌డింది. సోమ‌వారం విడాకుల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సిఉండ‌గా...జూన్ 15కు ఈ కేసును చెంగ‌ల్ప‌ట్లు ఫ్యామిలీ కోర్టు వాయిదా వేసింది. విడాకుల విష‌యంలో విజ‌య్ స‌గం ఆస్తిని భ‌ర‌ణంగా సంగీత డిమాండ్ చేస్తోన్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 20, 2026, 12.33 pm IST

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల కేసు వాయిదా – భ‌ర్త‌ ఆస్తిలో స‌గం భ‌ర‌ణంగా కావాల‌న్న సంగీత?
Advertisement

Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల కేసు వాయిదాప‌డింది. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే చెన్నైలోని చెంగ‌ల్ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. విజ‌య్‌, సంగీత‌ల విడాకుల కేసు విచార‌ణ సోమ‌వారం జ‌ర‌గాల్సివుంది. కానీ ఈ కేసును జూన్ 15కు వాయిదా వేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ అభ్య‌ర్థ‌న మేర‌కు విడాకుల కేసును కోర్టు వాయిదా వేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

తొలిసారి పోటీ....

టీవీకే పార్టీని స్థాపించిన విజ‌య్ తొలిసారి త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 23న ఎలెక్ష‌న్స్ జ‌రుగ‌బోతున్నాయి. ఈ టైమ్‌లో విడాకుల తీసుకుంటే వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ డ్యామేజ్ కావ‌డ‌మే కాకుండా పార్టీకి న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉండ‌టంతోనే విజ‌య్ విడాకుల కేసును జూన్‌కు వాయిదా వేయాల‌ని కోర్టును కోరిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.
జూన్ 15న జ‌రిగే విచార‌ణ‌కు నేరుగా కాకుండా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అటెండ్ కావ‌డానికి అనుమ‌తినివ్వాల‌ని విజ‌య్‌, సంగీత కోర్టును కోరిన‌ట్లు స‌మాచారం. వీరి అభ్య‌ర్థ‌న‌ను కోర్టు అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు.

విజ‌య్ ఆస్తిలో స‌గం

విజ‌య్, సంగీత విడాకులు తీసుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని స‌మాచారం. అయితే భ‌ర‌ణం విష‌యంలోనే డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ట‌. విజ‌య్ ఆస్తిలో స‌గం వ‌ర‌కు అంటే దాదాపు 250 నుంచి 300 కోట్ల వ‌ర‌కు భ‌ర‌ణంగా కావాల‌ని సంగీత డిమాండ్ చేస్తోంద‌ట‌. మ‌రోవైపు విజ‌య్ మాత్రం 35 కోట్లు మాత్ర‌మే ఇవ్వ‌డానికి అంగీక‌రించార‌ని అంటున్నారు. పిల్ల‌ల బాధ్య‌త‌ను తానే చూసుకుంటాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు. విడాకుల కేసు విచార‌ణ‌కు ముందే ఈ వ్య‌వ‌హారాల‌ను సెటిల్ చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.

హీరోయిన్‌తో వివాహేత‌ర సంబంధం

ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి ఓ హీరోయిన్‌తో వివాహేత‌ర సంబంధం ఉందంటూ విడాకుల పిటిష‌న్‌లో సంగీత పేర్కొన్న‌ది. ఆ హీరోయిన్‌ త్రిష‌నే అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. సంగీత‌కు విడాకులు ఇచ్చి త్రిష‌ను విజ‌య్ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లొస్తున్నాయి.

Advertisement
Advertisement